Matrimonial Site Scam: మ్యాట్రిమోనిలో అమ్మాయిని వెతుకుతున్నారా? జాగ్రత్త సుమా!
- మ్యాట్రిమోనియల్ సైట్లో భారీ మోసం
- పెళ్లయిన మహిళ ఫొటో పోస్ట్ చేసిన సైట్
- ఆమెకు తెలియకుండానే ప్రొఫైల్ క్రియోట్
- ఈ అంశంపై స్పందించిన సదరు మహిళ
- తాను సైట్లో ప్రొఫైల్ క్రియోట్ చేయలేదని స్పష్టం
- తనకు ఎప్పుడో పెళ్లయిందని.. అవి పెళ్లికి ముందు ఫొటోలని తెలిపిన వివాహిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది ఆన్లైన్ యుగం. పెళ్లి షాపింగ్ మాత్రమే కాదు.. వధువరులను కూడా ఆన్లైన్లోనే ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. కుటుంబ సభ్యులు అబ్బాయిలు, అమ్మాయిలను చూసేందుకు వెళ్లేవారు. ఏడు తరాలు చూసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లు వచ్చాయి. ఆన్లైన్లో సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురును వెతక వచ్చు. వారితో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. కానీ ఈ సైట్లలో చాలా మోసాలు జరుగుతుంటాయి. తాజాగా మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఫొటో పెట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రోఫైన్ను చూసిన మహిళ తన ఫొటో పెట్టి ఫేక్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసిన విషయాన్ని తెలిపింది.
READ MORE: Hyderabad: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా..
Also Read
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
స్వాతి ముకుంద్ అనే వివాహితన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ స్కామ్‌కు భారత్ మ్యాట్రిమోని బాధ్యులను చేసింది. తన ఫోటోను ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ ప్రొఫైల్‌లో అప్లోడ్ చేశారని, అది తాను పెళ్లి చేసుకోకంటే ముందు ఫొటోలని ఆమె ఆమె చెప్పింది. భారత్ మ్యాట్రిమోనీ యొక్క ఎలైట్ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లో ఈ ప్రొఫైల్ తనకు కనిపించిందని తెలిపింది. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన చిత్రాలు, తన పేరును అందులో కనిపించాయి. తనకు ఇదివరకే పెళ్లయిందని, భారత్ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ క్రియేట్ చేయలేదని స్వాతి చెప్పింది. అయినప్పటికీ, ఆమె ఫోటోను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్ సృష్టించారని ఆరోపించింది. డబ్బులు చెల్లిస్తేనే ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం భారత్ మ్యాట్రిమోనీ ఉంటుందని.. దీంతో అందరూ దీన్ని సురక్షితంగా భావిస్తారని ఆమె తెలిపింది. ఆమె ఫేక్ ప్రొఫైల్‌పై ఆందోళన వ్యక్తం చేసింది.
READ MORE:Germany: జర్మనీలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం.. త్వరలోనే ఎన్నికలు!
ఇలాంటి తప్పు మళ్లీ జరగదు: భారత్ మ్యాట్రిమోనీ
ఈ విషయంపై భారత్ మ్యాట్రిమోనీ స్పందిస్తూ.. సాంకేతిక లోపమే స్వాతి ఫోటో దుర్వినియోగం కావడానికి కారణమని పేర్కొంది. సమస్యను పరిష్కరించడానికి తమ వ్యవస్థలను పరిశీలిస్తున్నట్లు ప్లాట్‌ఫారమ్ తెలిపింది. వెంటనే స్వాతి ఫోటోను తొలగించింది. దీనితో పాటు, ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అదనపు భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, భారత్ మ్యాట్రిమోనీ క్లారిఫికేషన్‌ను స్వాతి తిరస్కరించింది. ఈ అంశం కేవలం పొరపాటు కాదని.. పెద్ద స్కామ్ అని ఆరోపించింది. ఇలాంటి సందర్భాల్లో ప్లాట్‌ఫారమ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపం ఉందని తెలిపింది. ఇలా ఒకరికి తెలియకుండా వారి ఫోటోను ఉపయోగించుకోవడం.. ఇతర వినియోగదారులకు కూడా ప్రమాదకరం పేర్కొంది. అయితే.. ఈ వివాదం భారత్ మ్యాట్రిమోనీ వినియోగదారులను ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్‌పై వారి వ్యక్తిగత సమాచారం, ఫోటోగ్రాఫ్‌లను అప్లోడ్ చేసిన వాళ్లు , చేయని వాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వారు సోషల్ మీడియాలో స్పందిస్తూ. భారత్ మ్యాట్రిమోనీ నుంచి మరిన్ని భద్రతా చర్యలు, మెరుగైన పర్యవేక్షణను కోరుతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer-BCCI: బీసీసీఐ కీలక సమావేశంకు శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఫిక్స్!
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!