NTV Telugu Site icon

Matrimonial Site Scam: మ్యాట్రిమోనిలో అమ్మాయిని వెతుకుతున్నారా? జాగ్రత్త సుమా!

Scam

Scam

ఇది ఆన్‌లైన్ యుగం. పెళ్లి షాపింగ్ మాత్రమే కాదు.. వధువరులను కూడా ఆన్లైన్‌లోనే ఎంచుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. కుటుంబ సభ్యులు అబ్బాయిలు, అమ్మాయిలను చూసేందుకు వెళ్లేవారు. ఏడు తరాలు చూసేవారని చెబుతారు. కానీ ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్లు వచ్చాయి. ఆన్‌లైన్‌లో సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చుని పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురును వెతక వచ్చు. వారితో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. కానీ ఈ సైట్‌లలో చాలా మోసాలు జరుగుతుంటాయి. తాజాగా మరో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత ఫొటో పెట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రోఫైన్‌ను చూసిన మహిళ తన ఫొటో పెట్టి ఫేక్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసిన విషయాన్ని తెలిపింది.

READ MORE: Hyderabad: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా..

స్వాతి ముకుంద్ అనే వివాహితన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసి, ఈ స్కామ్‌కు భారత్ మ్యాట్రిమోని బాధ్యులను చేసింది. తన ఫోటోను ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేశారని, అది తాను పెళ్లి చేసుకోకంటే ముందు ఫొటోలని ఆమె ఆమె చెప్పింది. భారత్ మ్యాట్రిమోనీ యొక్క ఎలైట్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌లో ఈ ప్రొఫైల్ తనకు కనిపించిందని తెలిపింది. ఇది చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన చిత్రాలు, తన పేరును అందులో కనిపించాయి. తనకు ఇదివరకే పెళ్లయిందని, భారత్ మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ క్రియేట్ చేయలేదని స్వాతి చెప్పింది. అయినప్పటికీ, ఆమె ఫోటోను ఉపయోగించి నకిలీ ప్రొఫైల్ సృష్టించారని ఆరోపించింది. డబ్బులు చెల్లిస్తేనే ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకునే అవకాశం భారత్ మ్యాట్రిమోనీ ఉంటుందని.. దీంతో అందరూ దీన్ని సురక్షితంగా భావిస్తారని ఆమె తెలిపింది. ఆమె ఫేక్ ప్రొఫైల్‌పై ఆందోళన వ్యక్తం చేసింది.

READ MORE:Germany: జర్మనీలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం.. త్వరలోనే ఎన్నికలు!

ఇలాంటి తప్పు మళ్లీ జరగదు: భారత్ మ్యాట్రిమోనీ
ఈ విషయంపై భారత్ మ్యాట్రిమోనీ స్పందిస్తూ.. సాంకేతిక లోపమే స్వాతి ఫోటో దుర్వినియోగం కావడానికి కారణమని పేర్కొంది. సమస్యను పరిష్కరించడానికి తమ వ్యవస్థలను పరిశీలిస్తున్నట్లు ప్లాట్‌ఫారమ్ తెలిపింది. వెంటనే స్వాతి ఫోటోను తొలగించింది. దీనితో పాటు, ఈ అంశంపై సమీక్ష నిర్వహిస్తామని.. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అదనపు భద్రతా చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, భారత్ మ్యాట్రిమోనీ క్లారిఫికేషన్‌ను స్వాతి తిరస్కరించింది. ఈ అంశం కేవలం పొరపాటు కాదని.. పెద్ద స్కామ్ అని ఆరోపించింది. ఇలాంటి సందర్భాల్లో ప్లాట్‌ఫారమ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, భద్రతా ఏర్పాట్లలో తీవ్ర లోపం ఉందని తెలిపింది. ఇలా ఒకరికి తెలియకుండా వారి ఫోటోను ఉపయోగించుకోవడం.. ఇతర వినియోగదారులకు కూడా ప్రమాదకరం పేర్కొంది. అయితే.. ఈ వివాదం భారత్ మ్యాట్రిమోనీ వినియోగదారులను ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్‌పై వారి వ్యక్తిగత సమాచారం, ఫోటోగ్రాఫ్‌లను అప్‌లోడ్ చేసిన వాళ్లు , చేయని వాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. వారు సోషల్ మీడియాలో స్పందిస్తూ. భారత్ మ్యాట్రిమోనీ నుంచి మరిన్ని భద్రతా చర్యలు, మెరుగైన పర్యవేక్షణను కోరుతున్నారు.