NTV Telugu Site icon

Video Viral: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..

Vedio Vairal

Vedio Vairal

Video Viral: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు భారీగా ఉన్నాయి. అసలు వాహనంలో ప్రయాణించడం కంటే ప్రభుత్వం నడిపే బస్సుల్లో ప్రయాణించడం మంచిదని వాహనదారులు ఆలోచిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వెరైటీ శిక్ష మధ్యప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం పోర్షే లగ్జరీ కారును రూ. 30 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగుచూశాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వెరైటీ పనిష్మెంట్ ఇస్తుంటారు. అయితే.. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధమే.. అయినా కూడా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కనిపించినప్పుడు, వారు జరిమానాల నుంచి తప్పించేకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు.

Read also: Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్

బైక్‌ పై వెళుతున్న ఇద్దరు యువకులు ఇలాంటి ఐడియానే ఉపయోగించారు. ఇద్దరు బైక్‌ పై వెళుతున్నారు. బైక్‌ నడిపే యువకుడికి హెల్మెట్ లేదు అయినా స్కూటర్ నడుపుతున్నాడు. ఇంతలోనే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులను చూశాడు. దీంతో ఆ యువకుడు ఓ ట్రిక్‌ ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ట్రాఫిక్‌ పోలీసుల ఎదురు నుంచి హెల్మెట్‌ లేకుండా తప్పించుకున్నాడా! అది ఎలా?. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్టవిరుద్ధమే.. కానీ బైక్ నెట్టడం కాదకదా!. పోలీసులను చూసిన ఆ యువకుడు స్కూటర్ దిగి సూటీని తోసుకుంటూ ముందుకు వెళ్లాడు. అయితే ఆ యువకుడు పోలీసుల ముందునుంచి బైక్‌ను తోసుకుంటూ పోవడం వల్ల బైక్‌ లో పెట్రోల్‌ అయిపోయిందేమో అందుకే ఆ యువకుడు బైక్‌ ను తోసుకుంటూ వెళుతున్నాడని పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులను దాటిన తర్వాత బాలుడు స్కూటీని స్టార్ట్ చేసి వేగంగా వెళ్లిపోయాడు. అయితే వెళుతున్న యువకుడ్ని బండిలో పెట్రోల్‌ అయిపోయిందా? అంటూ వెనుకనుంచి వస్తున్న వ్యక్తి అడుగుతుంటే నవ్వుతో కనుసన్నతో పోలీసులను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగాడు. అయితే.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఎన్ని చట్టాలు చేసినా భారతీయుల తెలివితేటల ముందు తేలిపోతాయి” అని ఒక వ్యక్తి కామెంట్‌ చేశాడు. “ఛా.. ఈ ట్రిక్‌ తెలియక ఎన్నో సార్లు ఫైన్‌ కట్టానో” అని మరొకరు పేర్కొన్నారు.

Show comments