NTV Telugu Site icon

Mobile Salon: అదిరిందయ్యా ఐడియా.. ఒక్క ఫోన్ తో ఇంటి వద్దకే సెలూన్!.. వీడియో వైరల్

Mobile Salon

Mobile Salon

మీరు చాలా రకాల సెలూన్‌లను చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా మోటార్ సైకిల్‌పై సెలూన్‌లను చూశారా?.. ప్రస్తుతం బార్బర్లు కూడా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక్క కాల్ చేస్తే ప్రతిదీ అందుబాటులోకి వచ్చనట్లే సెలూన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మీరు కటింగ్ పూర్తి చేయడానికి ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే బార్బర్ స్వయంగా దుకాణంతో పాటు మీ ఇంటికే వస్తాడు. ఎంటబ్బా ఇది కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా? ఇది మొబైల్ సెలూన్ . ఓ వ్యక్తి తన బైక్ ను సెలూన్ లాగా మార్చాడు. ఫోన్ చేసిన వాళ్ల ఇంటికి వెళ్లి హేయిర్ కట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

READ MORE: Leh Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఆరుగురు దుర్మరణం, మరో 22 మంది

బైక్‌పై పూర్తి సెలూన్‌..
ప్రస్తుత పరిస్థితుల్లో కూరగాయల నుంచి ఐస్‌క్రీం, ఫాస్ట్‌ఫుడ్‌ వరకు అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ హెయిర్ కట్ చేసుకోవాలన్నా, షేవింగ్ చేసుకోవాలన్నా బయట షాపుకు వెళ్లాల్సిందే. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీ ఈ సమస్యకు కూడా ముగింపు పలికింది. ఈ వీడియోలో.. ఓ వ్యక్తి తన బైక్‌పై ఒక సెలూన్‌ను ఏర్పాటు చేశాడు. తన ద్విచక్ర వాహనానికి మూడు చక్రాలు బిగించాడు. దానిపై ఇనుప కుర్చీని అమర్చాడు. షాప్ యొక్క చిన్న సెటప్‌ను తయారు చేసుకున్నాడు. పెద్ద అద్దాన్ని కూడా అమర్చాడు. కస్టమర్ ను బైక్ పై అమర్చిన ఇనుప కుర్చీపై కూర్చోబెట్టి కటింగ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ “ఇది చాలా మంచి ఐడియా.. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది.” అని కామెంట్ చేశారు. మరో నెటిజన్ .. “ఈ బార్బర్ నూతన ఆవిష్కరణ అద్భుతం.. ఇలాంటి సేవలు అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్లు అమలు చేస్తే బాగుంటుంది” అని రాసుకొచ్చారు.

READ MORE:Naga Chaitanya: మాజీ భార్య సమంతకు పోటీగా.. నాగ చైతన్య ఏం చేసాడంటే..?

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “Vikash Mohta” పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేయబడింది. కానీ దినికి సంబంధించిన పూర్తి సమాచారం.. అంటే ఈ వీడియో భారత దేశంలోని ఏ ప్రాంతానికి చెందినదో పూర్తి వివరాలు లేదు. కాగా.. బార్బర్ ద్విచక్ర వాహనంపై ఉన్న నంబర్ ప్లేట్ ను బట్టి ఈ వీడియో హరియాణా రాష్ట్రానికి చెందినదిగా గుర్తించ వచ్చు.