ప్రతి ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ అనేది అనివార్యం. అయితే.. ఇంచుమించు ఇంటితో సమానంగా ఉద్యోగ సమయంలో కార్యాలయాలలో గడుపుతుంటారు. అంతేకాకుండా ఆఫీసులోని సహోద్యోగులకు పెరిగిన బంధం కూడా తక్కువేం ఉండదు. అయితే.. ఇదే పదవి విరమణ ఉపాధ్యాయులకు మరింత ప్రత్యేకమని చెప్పాలి. పాఠశాలలో విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉండే అనుబంధం అంతాఇంతా కాదు. ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుంటే.. వెళ్లవద్దంటూ ఏడ్చేసిన సంఘటన కొన్ని వైరల్ అయ్యాయి కూడా. అయితే ఇప్పుడు చెప్పేది కూడా అలాంటిదే.. తను 22 ఏళ్ల వయసులో ఓ టీచర్ ఇంగ్లీష్ బోధించేందుకు పాఠశాలలో చేరింది.
అయితే ఆమె నిర్విరామంగా 30 సంవత్సరాలుగా అదే పాఠశాలలో ఇంగ్లీషు బోధిస్తూ.. ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులు తీర్చిదిద్దింది. తాజాగా ఆమె పదవివిరమణ పొందుతున్న నేపథ్యంలో ఆ పాఠశాలలలోని విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు ఆమెకు వీడ్కోలు పలికిన విధానం ఆమె కంటి వెంట ఆనంద బాష్పాలు పెట్టించింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఆమె కూతురు కేథరిన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో.. వైరల్‌గా మారింది. ఇది చూసిన ఆమె పూర్వ విద్యార్థులు సైతం ఆమె గురించి గొప్పగా కామెంట్లు పెడుతున్నారు.
https://www.instagram.com/reel/CeTxNdWgFFp/?utm_source=ig_web_button_share_sheet
