NTV Telugu Site icon

UP: యువకుడిని బెల్టుతో కొడుతూ.. పోలీసుల చిత్ర హింసలు(వీడియో)

Up Police

Up Police

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఓ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ యువకుడిని బెల్టుతో కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో మహేవా అవుట్‌పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్ జగదీష్ భాటి ఔట్‌పోస్ట్‌లో ఒక యువకుడిని బెల్టుతో కొట్టడం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇన్‌స్పెక్టర్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు ప్రారంభించారు. వీడియోకు సంబంధించి విచారణ చేపట్టామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సంజయ్ కుమార్ తెలిపారు. విచారణ అనంతరం ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఎస్పీ తెలిపారు. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు పోలీసులపై మండిపడుతున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పోలీసులకు అలవాటుగా మారిందని వారికి కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు.

READ MORE: US-India: అమెరికాలో వడ్డీరేట్ల కోత భారతీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

అయితే ఈ వీడియోకు సంబంధించిన మరో వార్త కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో సెప్టెంబర్ , 2024కు సంబంధించినది. ఓ వ్యక్తి అప్పుడు దొంగచాటున వీడియో తీసి గురువారం సోషల్ మీడియాలో వైరల్ చేశాడని సమాచారం. అయితే.. బకేవార్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర కుమార్ మిశ్రా తన కుమారుడు మయాంక్ మిశ్రాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం మత్తులో మయాంక్ తన తండ్రి, సోదరిని కొట్టడం, దుర్భాషలాడడంతోపాటు చంపేస్తానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు మయాంక్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ యువకుడిని ఇన్స్పెక్టర్ జగదీష్ భాటి. దీని కారణంగా యువకుడిని పోలీసు కొట్టాడని చెబుతున్నారు.

Show comments