Site icon NTV Telugu

Auto Brewery Syndrome : ఇదేం విచిత్రం రా బాబు.. ఆటోమెటీక్ గా ఆల్కహాల్ తయారీ…

Rare

Rare

శరీరంలో కొన్ని హార్మోన్లు మనం తినే ఆహారం ద్వారా శరీరానికి అందుతాయి. అలాగే మరికొన్ని ప్రోటీన్స్ ను శరీరం తయారు చేసుకుంటుంది.. మనం తీసుకొనే ఆహారం శరీరానికి కావలసిన పోషకాలను తయారు చేసుకుంటుంది.. కానీ ఆల్కహాల్ ను తయారు చేసుకోవడం అంటే ఎప్పుడైన విన్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.. ఆ వ్యక్తి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే..బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు.  అతడు మద్యం తాగకపోయినా, అతడి శరీరంలో ఆటోమేటిక్ గా మద్యం తయారవుతుంది.. అందుకే ఆ వ్యక్తి ఎప్పుడు తాగిన వ్యక్తిలాగా ఉంటాడు.. మొదట్లో మితిమీరి మద్యం తాగినప్పటికీ.. ఆ తరువాత ఆ అలవాటును అతడు వదిలేశాడు.. ఇప్పుడు లిక్కర్ ఫ్యాక్టరిలో పనిచేస్తున్నాడు.. అయితే ఓసారీ మద్యం తాగి వాహనం నడుపుతున్నాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అతను కోర్టుకు వెళ్లిన తర్వాత న్యాయవాదులు అతని పరిస్థితి పై విచారణ కోరారు.. అలాగే అతడిని స్వతంత్రంగా పరీక్షించిన ముగ్గురు వైద్యులు అతను ఏబీఎస్ తో బాధపడుతున్నట్లు ధ్రువీకరించారు.. స్వంతంగా తన శరీరం మధ్యాన్ని తయారు చేసుకుంటుందని తెలుసుకున్నారు. అందుకే అతను అలా ఉన్నాడని మొత్తానికి తెల్చేశారు.. ఈ వ్యాధికి మందులేదని కూడా వైద్యులు తెలిపారు.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Exit mobile version