Site icon NTV Telugu

Love proposal: లవర్‎కు వెరైటీగా ప్రపోజ్ చేయాలకున్నాడు.. ఫ్రెండ్స్ ను వెర్రోళ్లను చేశాడు

Love Proposal

Love Proposal

Love proposal: ఎన్ని పేర్లతో పిలిచినా ఎన్ని భాషలతో సంభాషించినా పేరు మాత్రం ఒక్కటే ప్రేమ. ప్రేమ పుట్టడానికి సమయం సందర్భం ఉండదు. అది మనసుకు సంబందించింది. ఈ మహావిశ్వంలో అందరికీ అందుబాటులో ఉండే గొప్ప సబ్జెక్ట్ ప్రేమ. ఏదో ఒక సమయంలో ఎవరైనా ఖచ్చితంగా ఈ ప్రేమ విషయంలో మునిగిపోతారు. అది పెళ్లికి ముందు కావచ్చు, పెళ్లి తర్వాత కావచ్చు. ఒక్కోసారి ప్రేమ సాగరంలో పడి కొట్టుకుపోవాల్సి వస్తుంది. అయితే ప్రేమలో పడటం ఒకటైతే ప్రేమికుడిని ఇంప్రెస్ చేసేందుకు ప్రపోజ్ చేయడం మరో ఎత్తు. ఎక్కువగా అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తుంటారు. ఒక్కో ప్రేమికుడు ఒక్కో స్టైల్‌లో ప్రపోజ్ చేస్తాడు. వారు గ్రీటింగ్ కార్డులు, బహుమతులు లేదా చాక్లెట్ల ద్వారా వారి మనసులోని ప్రేమను చెబుతుంటారు. మరికొందరు అమ్మాయి ప్రేమలో మునిగిపోయిన అబ్బాయిలు హీరోలా ఫీల్‌ అయిపోయి సినిమా స్టైల్లో ప్రపోజ్‌ చేస్తుంటారు.

ఇప్పుడు ప్రేమికుడు సినిమా రేంజ్‌లో అమ్మాయికి ప్రపోజ్ చేసిన లవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ప్రేమ సన్నివేశానికి ముందు సినిమా సీన్ కూడా సరిపోదనిపిస్తుంది. ఈ యువకుడు తన ప్రియమైన ప్రియురాలికి ప్రపోజ్ చేయడానికి తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు. తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నాడు. వెనుక నుంచి ఓ కుర్రాడు స్కూటర్‌పై నల్లటి టీషర్ట్‌పై లవ్ సింబల్‌తో తన స్నేహితుడి ముందు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇంగ్లీషులో ఐ అనే అక్షరం ఉన్న తెల్లటి టీషర్ట్ ధరించిన మరో స్నేహితుడు, ఇంగ్లీషులో యూ అక్షరం ఉన్న తెల్లటి టీ షర్ట్ ధరించిన మరో స్నేహితుడు బైక్ పై ముందుకు వెళ్లి ఆ అమ్మాయికి కనిపించేలా వరుసగా వాహనాలు నడుపుతూ ‘నేను. ప్రేమిస్తున్నాను’.

ఇదంతా వెనుక నుంచి వీడియో తీస్తున్న మరో వ్యక్తి ఫ్లవర్స్‌ బొకే (పుష్పగుచ్ఛం) తీసుకొచ్చి స్నేహితుడికి ఇస్తాడు. స్నేహితుడు పుష్పగుచ్ఛాన్ని తీసుకుని… బైక్‌ని ఒకవైపు ఆపి మోకాళ్లపై కూర్చుని అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మనోడు ఇంక ఆగుతదా సినిమా హీరోలా రోడ్డుపై ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. అది చూసి స్నేహితులు నవ్వుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఈ లవ్ ప్రపోజల్ సీన్ నచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే ఎందుకంటే వీరిలో ఒకరికి తప్ప మరెవ్వరికి హెల్మెట్ లేదు. రోడ్డుపై ఉన్న అమ్మాయికి ప్రపోజ్ చేయడమే కాకుండా, హెల్మెట్ లేకుండా హైవేపై బైక్ నడపడం మాత్రమే వారు చేసిన తప్పు. లవ్ ప్రపోజల్ సీన్ ని జనం లేని ప్రదేశంలో లేదా హెల్మెట్ లేని ప్రాంతంలో సెట్ చేసి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఇలాంటి వారివల్లే యూత్ సర్వనాశనం అవుతున్నారని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. వెరైటీ అంటూ ఎకిరివేశాలు వేయడం మాని జీవితంలో తల్లిదండ్రులపై ఇలాంటి ప్రేమను చూపించండి అంటూ మరో నెటిజన్లు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ప్రపోజ్ అయితే చేశాడు కానీ అమ్మాయితో సహా స్నేహితులను కూడా బుక్ చేశాడు. అందుకే ఏదైనా చేసే ముందు ఆలోచించాలని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై తమిళనాడు ప్రభుత్వం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version