NTV Telugu Site icon

Old Letter: బయటపడ్డ 132 ఏళ్ల నాటి లేఖ.. అందులో ఏముందంటే?

Old Letter

Old Letter

స్కాట్లాండ్‌లోని చారిత్రక లైట్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్‌లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు.

READ MORE: Shobhita Suicide: షాకింగ్: నటి శోభిత సూసైడ్

రస్సెల్, ఆయన బృందం కిర్క్‌కాల్మ్‌లోని కార్న్‌వాల్ లైట్‌హౌస్ పునరుద్ధరణపై పని చేస్తున్నారు. వారు లైట్‌హౌస్ గోడలో సీసాని కనుగొన్నారు. ఈ లైట్ హౌస్ 1817లో నిర్మించారు. ఈ పార్చ్‌మెంట్ నిధి మ్యాప్ అని లైట్‌హౌస్ యజమాని మొదట్లో సరదాగా చెప్పాడు. కానీ అది 1892లో ఇంజనీర్లు, లైట్‌హౌస్ కీపర్లు క్విల్ ఇంక్‌తో రాసిన సందేశమని తరువాత గ్రహించారు. కార్న్‌వాల్ పోస్ట్ పైభాగంలో కొత్త ఫ్రెస్నెల్ లెన్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఇది ఒక రకమైన లాంతరు కాంతిని అందిస్తుంది. ప్రస్తుతం ఇంజనీర్లు పనిచేస్తున్న పరికరాలు ఇదే.

READ MORE:Heart Attack: 14 ఏళ్ల బాలుడికి గుండెపోటు..స్కూల్‌ రన్నింగ్ ఈవెంట్‌లో ఘటన..

ఈ లెటర్‌లో.. “ఈ లాంతరును జేమ్స్ వెల్స్ ఇంజనీర్, జాన్ వెస్ట్‌వుడ్ మిల్‌రైట్, జేమ్స్ బ్రాడీ ఇంజనీర్, డేవిడ్ స్కాట్ లేబరర్, జేమ్స్ మిల్నే & సన్ ఇంజనీర్స్, మిల్టన్ హౌస్ వర్క్స్, ఎడిన్‌బర్గ్‌ల సంస్థ తయారు చేసింది. ఇది మే, సెప్టెంబరు నెలల్లో అమర్చారు. దీన్ని15 సెప్టెంబర్ 1892, గురువారం రాత్రి మళ్లీ వెలిగించారు.” అని రాసి ఉంది. ఆ సంస్థ ఇంజనీర్లు విలియం బర్నెస్, జాన్ హారోవర్, జేమ్స్ డాడ్స్ ఇన్‌స్టాల్ చేశారని కూడా లేఖలో పేర్కొన్నారు. ఇంజనీర్ల బృందం ఒక సవాలుతో కూడిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత ఈ లేఖను రాసింది.