స్కాట్లాండ్‌లోని చారిత్రక లైట్‌హౌస్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇంజినీర్లు ఓ సీసాలో 132 ఏళ్ల నాటి లేఖను గుర్తించారు. లెటర్‌లో రాసింది చదివిన ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు అందులో రాశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. 36 ఏళ్ల ఇంజనీర్ రాస్ రస్సెల్ ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి బీబీసీకి చెప్పారు.