Old Woman Rides Bullet Bike: 60 ఏళ్ల వయస్సులో బుల్లెట్ బైక్ నేర్చుకున్న వృద్ధురాలు.. షాకవుతున్న యువత
- కేవలం రెండే రోజుల్లో బైక్ నేర్చుకుని అందరిని
- ఆశ్చర్యానికి గురిచేసిన లతా శ్రీనివాసన్
- యువతీ యువకులతో పోటీగా బైక్ రైడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
60 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధురాలు కేవలం రెండే రోజుల్లో బైక్ నేర్చుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా 60 ఏళ్లు వచ్చాయంటే కేవలం ఇంటికే పరిమితమవుతారు. కానీ ఇక్కడ ఓ బామ్మ మాత్రం యవతతో కలిసి బైక్ నేర్చుకుని అందరిని ఔరా అనిపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కేఫే క్రూయిజర్స్ మోటార్‌సైకిల్ అకాడమీలో పలువురు యువతీ–యువకులు బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అదే అకాడమీలో ఈ 60 ఏళ్ల బామ్మ లతా శ్రీనివాసన్ కూడా చేరి వారితో సమానంగా శిక్షణ ప్రారంభించారు. మొదటి రోజే క్లచ్, బ్రేక్, గేర్ మార్పు వంటి ప్రాథమిక విషయాలన్నీ నేర్చుకున్నారు. రెండో రోజుకే సెకండ్, థర్డ్ గేర్లలో బైక్‌ను స్మూత్‌గా నడిపి ట్రైనర్లను ఆశ్చర్యపరిచారు.
Also Read
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
- Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
వడవల్లికి చెందిన లతా శ్రీనివాసన్ గతంలో కార్పొరేట్ మేనేజర్‌గా పనిచేశారు. చిన్నప్పటి నుంచే బైక్ రైడ్ చేయాలన్న కోరిక ఉన్నా, దాన్ని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అయితే ఆమెకు సైక్లింగ్‌పై మంచి అనుభవం ఉంది—ఒక్కరోజులో 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన రికార్డ్ కూడా ఉంది.వయసు 60 దాటినా, “ఇంకెందుకు ఆలస్యం?” అనుకుని, జీవితంలో మిగిలిన రోజుల్ని సైకిల్ కాదు, బైక్‌పై ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో మోటార్‌సైకిల్ అకాడమీలో చేరి సీరియస్‌గా నేర్చడం ప్రారంభించారు.
అదిరే వేగంతో నేర్చుకుంటూ, రకరకాల మోడల్ బైక్‌లను ట్రై చేసి, చివరికి తిరుగులేని రైడర్‌గా నిలిచారు. ఆమె దూకుడు చూసి ట్రైనర్లే “ఇంత త్వరగా నేర్చిందేంటి!” అని ఆశ్చర్యపోయారు.లతా శ్రీనివాసన్ చూపించిన పట్టుదల, జోష్, నేర్చుకోవాలనే తపన అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!