తనకు కాబోయే భర్త కోసం ఒక మహిళ యొక్క పొడవైన జాబితా ఆన్‌లైన్ చర్చకు దారితీసింది. సోషల్ మీడియా వినియోగదారుల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీ.ఈడీ డిగ్రీ పూర్తి చేసి.. రూ. 1.3 లక్షల వార్షికాదాయం కలిగిన 39 ఏళ్ల మహిళ విడాకుల అనంతరం.. తన రెండో భర్తకు ఎలాంటి ఆస్తులు, తదితర అంశాలపై పెద్ద జాబితాను రూపొందించింది. ప్రస్తుతం ఈ జాబితా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన రెండో భాగస్వామికి ఏడాదికి కనీసం రూ. 30 లక్షలు లేదా విదేశాల్లో నివసిస్తుంటే $96,000 (సుమారు రూ. 80 లక్షలు) సంపాదన ఉండాలని నిర్ణయించింది. అంతే కాకుండా తనకు కాబోయే భర్తకు మూడు బెడ్రూమ్ లు కలిగిన ఇళ్లు ఉండాలని పేర్కొంది. అందులో ఆమె తల్లిదండ్రులు కూడా ఉంటారని రాసుకొచ్చింది.
READ MORE: BJP VS INDIA: సీజేఐ ఇంటికి ప్రధాని మోడీ వెళ్లడంపై రాజకీయ దుమారం..
ఎంబీఏ లేదా ఎమ్ఎస్ (US నుంచి), సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న సభ్యులకు ప్రాధాన్యతను ఇస్తోంది. ప్రయాణాలు, ఫైవ్‌స్టార్ హోటళ్లపై ఆమెకున్న ప్రేమను సదరు మహిళ ప్రొఫైల్ హైలైట్ చేస్తోంది. ఇంటి పనులు తన బాధ్యత కాదని ఆమె స్పష్టం చేసింది. ఆమె వంట మనిషిని, పనిమనిషిని నియమించుకోవాలని సూచించింది. ఆమె అత్తమామల నుంచి విడిగా జీవించడానికి ఇష్టపడుతుంది. చాలా మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంతో పోస్ట్ చాలా దృష్టిని ఆకర్షించింది.
READ MORE: Stock market: మరోసారి రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్
ఒక వినియోగదారు.. “ఆమెకు అవివాహితుడు కావాలి. కాని ఆమె మాత్రం విడాకులు తీసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెతో ఉంటారు. కానీ ఆమె అత్తమామలు కాదు. ఆమె జీతం నెలకు రూ. 11,000, ఇది పట్టణ ప్రాంతాల్లో పనిమనిషి జీతంతో సమానం. . కానీ ఆమె తన భర్త ద్వారా బాగా స్థిరపడాలి. ఇదెక్కడి కండిషన్” అని రాసుకొచ్చారు. “ఈ రోజుల్లో వివాహాలు వ్యాపార ఒప్పందంలా మారుతున్నాయి” అని ఒక వ్యక్తి కామెంట్ చేయగా.. “ఆమెకు చాలా అంచనాలు ఉన్నాయి” అని మరొకరు పేర్కొన్నారు. పోస్ట్ ను1.5 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
Her qualities and salary 🤡
Expected husbands qualities and salary🗿🗿 pic.twitter.com/NGgJvVvN9l— ShoneeKapoor (@ShoneeKapoor) September 10, 2024