మధ్యప్రదేశ్‌లో కరోనా కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు, నిబంధనలను అమలు చేస్తున్నది. వేడుకలకు జనాల పరిమితికి మించి జనాలను అనుమతించడంలేదు. ఇక అంత్యక్రియలకు కూడా పరిమితికి మించి అనుమతించడం లేదు. అయితే, రాజ్‌గడ్‌జిల్లాలోని దాలుపురా గ్రామంలో ఓ వానరం మృతి చెందడంతో దానికి గ్రామస్తులు సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. వానరం అంత్యక్రియలకు గ్రామస్తులంతా కదలివచ్చారు. ఈ అంత్యక్రియల్లో దాదాపు 1500 మంది పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం గ్రామస్తులంతా చందాలు వేసుకొని భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.
Read: ఈ మూడింటిని పాటిస్తే… కరోనాను కట్టడి చేయవచ్చు…
ఒకేచోట అంతమంది గుమిగూడటంతో కరోనా వ్యాపిస్తుందనే భయం ఎవరిలోనూ కనిపించలేదు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఈ స్థాయిలో ప్రజలు ఒకేచోట గుమిగూడటంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు ఆదేశించింది. వానరం అంత్యక్రియలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ అంత్యక్రియల్లో ప్రధాన పాత్రను పోషించిన ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.