NTV Telugu Site icon

Zomato: డెలివరీ చేసింది చాలు. ఇక.. ‘‘ఇంటికి వెళ్లండి’’

Zomato

Zomato

Zomato: జొమాటో అనగానే ఫుడ్ డెలివరీ గుర్తుకొస్తుంది. నిమిషాల వ్యవధిలో ఇంటికి తెచ్చిస్తారు. ఇంటికే కాదు. ఆఫీసులో ఉన్నా.. మరెక్కడ ఉన్నా.. లోకేషన్ ప్రకారం వాలిపోతారు. పార్సిల్ మన చేతిలో పెట్టిపోతారు. అయితే ఆ సంస్థ ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. దాదాపు 3 శాతం మంది సిబ్బందిని పనిలోంచి తీసేయాలనుకుంటోంది. తద్వారా లాభాలు ఆర్జించాలని కూడా ఆశిస్తోంది. పెద్ద పెద్ద టెక్నాలజీ సంస్థలు, సోషల్ మీడియా సైట్లు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో జొమాటో సైతం అదే బాట పడుతోంది. పెర్ఫార్మెన్స్ ఆధారంగా తొలగిస్తుంది. జొమాటోలో ప్రస్తుతం మొత్తం 3 వేల 800 మంది ఉద్యోగులున్నారు. 30 శాతం మందిని.. అంటే.. కనీసం వెయ్యి మందిని ఇంటికే పరిమితం చేస్తారు. 2020వ సంవత్సరం మే నెలలో కూడా జొమాటో కొవిడ్ నేపథ్యంలో 520 మందిని కొలవుల నుంచి తీసేసింది.