NTV Telugu Site icon

Telangana Government: హైదరాబాద్‌లో మోడ్రన్‌ హాస్పిటల్స్‌ నిర్మాణ కాంట్రాక్టులు

Telangana Government

Telangana Government

Telangana Government: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్‌ ఆఫ్‌ అవార్డును అందజేసింది. సనత్‌ నగర్‌, ఎల్‌బీ నగర్‌, ఆల్వాల్‌ ఏరియాల్లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్‌ అనే పేరుతో పిలుస్తారు.

IT Companies Q3 Performance: సంతోషంగా సెండాఫ్‌.. ఆనందంగా ఆహ్వానం..

టిమ్స్‌.. అంటే.. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అని అర్థం. ఈ 3 టిమ్స్‌ను లార్సెన్‌ అండ్‌ టూబ్రో, మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ మరియు DEC ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థలు నిర్మిస్తాయి. ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ను L&Tకి, సనత్‌ నగర్‌ టిమ్స్‌ను MEILకి, ఆల్వాల్‌ టిమ్స్‌ను DECకి అప్పగించారు. ఈ మేరకు L&Tకి 668 కోట్ల రూపాయలు, MEILకి 667 కోట్ల రూపాయలు, DECకి 669 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారు.

L&T ఇప్పటికే వరంగల్‌లో 1,750 బెడ్‌ల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 33 అంతస్తుల ఈ నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటిగా, దేశంలోని అత్యంత ఎత్తైన హాస్పిటల్‌గా నిలిచిపోతుందని చెబుతున్నారు. ఈ మూడు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ గతేడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన చేశారు.
YouTube video player

Show comments