NTV Telugu Site icon

Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ

Swiggy's Losses

Swiggy's Losses

Swiggy’s Losses: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ నష్టాలు 2022 ఆర్థిక సంవత్సరంలో రెట్టింపయ్యాయి. అంతకుముందు ఏడాది 16 వందల 17 కోట్ల రూపాయలు మాత్రమే నష్టం రాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 629 కోట్ల రూపాయలకు చేరాయి. ఖర్చులు సైతం భారీగా.. అంటే.. ఏకంగా 131 శాతం పెరిగి 9 వేల 574 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి స్విగ్గీ సమర్పించిన వార్షిక ఆర్థిక నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

ఆ రిపోర్ట్‌ ప్రకారం 2022 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో స్విగ్గీ డెకాకార్న్‌గా ప్రమోట్‌ అయింది. మార్కెట్‌ వ్యాల్యూ 10 బిలియన్‌ డాలర్ల కన్నా ఎక్కువగా నమోదైంది. ఇన్‌వెస్కో అనే సంస్థ ఆధ్వర్యంలో 700 మిలియన్‌ల ఫండ్‌ రైజ్‌ చేయటంతో ఈ హోదాను సొంతం చేసుకుంది. కంపెనీ ఆదాయం 2 పాయింట్‌ 2 రెట్లు పెరిగి 5 వేల 705 కోట్లకు చేరినప్పటికీ మొత్తం ఖర్చుల్లో ఔట్‌ సోర్సింగ్‌ సపోర్ట్‌ ఖర్చులు దాదాపు 25 శాతానికి పెరగటం దెబ్బతీసింది.

read more: Steve Jobs @ Apple: ‘యాపిల్‌’ ఉన్నంత కాలం.. యాదికొస్తూనే ఉంటాడు..

అడ్వర్టైజింగ్‌ అండ్‌ ప్రమోషనల్‌ ఖర్చులు 4 రెట్లు తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో స్విగ్గీ 250 మంది ఉద్యోగులను తొలగించబోతోందంటూ డిసెంబర్‌లో వార్తలొచ్చాయి. అయితే.. ఉద్యోగుల పనితీరును బేరీజు వేసిన ప్రతిసారీ లేఆఫ్‌లనేవి కామన్‌గా జరుగుతుంటాయని స్విగ్గీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలాఉండగా స్విగ్గీ బిజినెస్‌ని ఎక్కువ శాతం జొమాటో సొంతం చేసుకుంటోందని గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ జెఫరీస్‌ నవంబర్‌లో తెలిపింది.