Special Interview with Founders of Darwin Box: మేనేజ్‌మెంట్, మనీ అండ్ మ్యాన్‌పవర్.. ఈ మూడూ ఉంటే ఏ కంపెనీ అయినా టాప్‌లో వెళుతుంది. డార్విన్ బాక్స్ యాప్ అనే సంస్థ కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. యూనికార్న్ క్లబ్‌లో చేరి హైదరాబాదీలు గర్వపడేలా చేసింది. ఈ కంపెనీ కోఫౌండర్లు రోహిత్ చెన్నమనేని, చైతన్య పెద్దిలతో ‘‘ఎన్-బిజినెస్ ఐకాన్’’ టీం ముచ్చటించింది. ఆ విశేషాలు వాళ్ల మాటల్లోనే.. ఈ సంస్థను ఏడేళ్ల కిందట ముగ్గురం కలిసి స్థాపించాం. సంస్థలు శరవేగంగా అభివృద్ధి చెందటానికి టెక్నాలజీయే అత్యుత్తమ మార్గమని గుర్తించి ఆ దిశగా మా ప్రయాణాన్ని ప్రారంభించాం. మాకు మంచి ఇన్వెస్టర్లు దొరికారు.
ఇప్పుడు 90 దేశాలకు చెందిన 700లకు పైగా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. 20 లక్షల మంది యూజర్లను కలిగి ఉన్నాం. ఎండ్ టు ఎండ్ హెచ్‌ఆర్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా మాకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాం. ఒక ఎంప్లాయి కంపెనీలో చేరక ముందు నుంచి.. అంటే.. ఇంటర్వ్యూలో చూపిన పెర్ఫార్మెన్స్ మొదలుకొని ప్రతి అంశాన్నీ రికార్డ్ చేయటం, వాట్సాప్‌లో అప్డేట్స్ ఇవ్వటం వంటివన్నీ సెల్‌ఫోన్ స్థాయిలోనే నిర్వహిస్తున్నాం. యూనికార్న్ క్లబ్‌లో చేరతామని ఊహించలేదు. ఆ గుర్తింపు రావటాన్ని గొప్పగా భావిస్తున్నాం. హెచ్‌ఆర్ టెక్నాలజీ ఫీల్డ్‌లో పోటీ వాతావరణం ఉంది.
read more: Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కి టాటా.. ప్రత్యామ్నాయ సోషల్ మీడియా కోసం వేట..
అయినప్పటికీ.. పాతిక, ముప్పై ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉన్న సంస్థలను కూడా కాదని క్లయింట్లు మా దగ్గరకు వస్తున్నారంటే మేం వాళ్ల అంచనాలకు తగ్గట్లుగా పనిచేస్తున్నామనే సంతృప్తి ఉంది. మాలాంటి చిన్న సంస్థ నుంచి ప్రొడక్ట్ వస్తే.. అసలు.. ఎవరైనా తీసుకుంటారా అనే అనుమానం తొలినాళ్లలో ఉండేది. కానీ.. డే-1 నుంచి మాకు మార్కెట్‌లో మంచి పేరు వచ్చింది. జీవీకే బయో, సాయి లైఫ్ సైన్సెన్స్, భారత్ బయోటెక్, యశోద హాస్పిటల్స్, టీవీఎస్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ఎన్నో లోకల్ అండ్ గ్లోబల్ కంపెనీలులు మమ్మల్ని అభినందించాయి.
కంపెనీలకు అసలు బయోమెట్రిక్ అవసరమే లేకుండా హెచ్‌ఆర్ యాక్టివిటీస్ అన్నీ చేయాలనేది మా లక్ష్యం. ‘‘డార్విన్ బాక్స్’’తో ఆ ప్రాసెస్ మొత్తం మొబైల్‌లోనే జరిగిపోతుంది. ఉద్యోగులకు, యాజమాన్యానికి హెచ్‌ఆర్ మొత్తం తమ జేబులోనే అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఉద్యోగికి, హెచ్‌ఆర్‌కి తమ పనులు ఈజీ అయ్యాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ లాగే ఇందులో వైబ్ అనేది ఉంది. ఉద్యోగుల బర్త్‌డేలు, వర్క్ యానివర్సరీలు, గుడ్ పెర్ఫార్మెన్స్.. ఇలా ప్రతిదీ ఇందులో షేర్ చేసుకోవచ్చు. విషెస్ చెప్పుకోవచ్చు. రీయింబర్స్‌మెంట్ అండ్ ట్రావెల్ అనే ఆప్షన్‌లో క్యాబ్, ఫ్లైట్ బుకింగ్స్, పేమెంట్స్, రీయింబర్స్‌మెంట్ వంటివన్నీ చేసుకోవచ్చు. ట్రావెల్ బుకింగ్‌ల కోసం ‘‘మేక్ మై ట్రిప్’’ లాంటివి అవసరంలేదు.
‘‘డార్విన్ బాక్స్’’కు సంబంధించి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ‘‘ఎన్-బిజినెస్ ఐకాన్ టీం’’ నిర్వహించిన ఈ స్పెషల్ ఇంటర్వ్యూ వీడియో చూడొచ్చు. వీడియో లింక్ ఈ కిందనే ఉందని గమనించగలరు.