Reliance-Metro Deal: రిలయెన్స్ రిటైల్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీని పూర్తిగా అక్వైర్ చేసుకుంటోంది. దీంతో బిజినెస్‌పరంగా రిలయెన్స్ పంట పండినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెట్రోను కొనుగోలు చేయటం ద్వారా రిలయెన్స్ రిటైల్‌కి ఒకేసారి ఏకంగా 30 లక్షల మంది వినియోగదారులు పెరగనున్నారు.
ఇందులో కనీసం 10 లక్షల మంది రెగ్యులర్ కస్టమర్లు కావటం విశేషం. ఫలితంగా రిలయెన్స్ రిటైల్ వ్యాపారం భారీగా ఊపందుకోనుంది. మెట్రోని రిలయెన్స్ 2 వేల 850 కోట్ల రూపాయలకు అక్వైర్ చేసుకుంటోంది. మన దేశంలో 2003లో కార్యకలాపాలను ప్రారంభించిన మెట్రోకి ఇప్పుడు 21 నగరాల్లో 31 లార్జ్ ఫార్మాట్ స్టోర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పెద్ద సంఖ్యలో ఉన్న కిరాణా షాపులు, ఇతర సంస్థాగత వినియోగదారులు, సప్లయర్ నెట్‌వర్క్ ఉంది.
IPL Cricket: ఇండియన్ ప్రాఫిటబుల్ లీగ్read also:
రిలయెన్స్ రిటైల్‌కి ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా 16 వేల 617 స్టోర్లు ఉన్నాయి. గతేడాది కన్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో 36 శాతం ఎక్కువ నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో మొత్తం రెవెన్యూ 64 వేల 396 కోట్లకు చేరింది. మెట్రో ఇండియా సైతం గత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ త్రైమాసికం నాటికి 7 వేల 700 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది.
ఇప్పుడు ఈ రెండు పెద్ద సంస్థలు ఒక్కటి కానుండటంతో రిలయెన్స్ రిటైల్ బిజినెస్ బాహుబలి లెవల్లో పెరగనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిలయెన్స్ రిటైల్.. మెట్రో ఇండియాని అక్వైర్ చేసుకునే ప్రక్రియ.. రెగ్యులేటరీ క్లియరెన్స్‌లన్నీ లభిస్తే 2023 మార్చి చివరికి అధికారికంగా పూర్తికానుందని అంచనా.