Reliance-Metro Deal: రిలయెన్స్ రిటైల్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని మెట్రో క్యాష్ అండ్ క్యారీని పూర్తిగా అక్వైర్ చేసుకుంటోంది. దీంతో బిజినెస్‌పరంగా రిలయెన్స్ పంట పండినట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెట్రోను కొనుగోలు చేయటం ద్వారా రిలయెన్స్ రిటైల్‌కి ఒకేసారి ఏకంగా 30 లక్షల మంది వినియోగదారులు పెరగనున్నారు. ఇందులో కనీసం 10 లక్షల మంది రెగ్యులర్ కస్టమర్లు కావటం విశేషం. ఫలితంగా రిలయెన్స్ రిటైల్ వ్యాపారం భారీగా ఊపందుకోనుంది.