Reliance Industries-Naphtha Sale: నాఫ్తా అనేది మండే స్వభావం గల ద్రవ హైడ్రోకార్బన్ మిశ్రమం. సహజ వాయువును ఘనీభవనానికి గురిచేయటం ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తారు. పెట్రోలియాన్ని స్వేదనం చెందించటం వల్ల కూడా తయారుచేస్తారు. బొగ్గు తారును మరియు పీట్‌ను కలిపి స్వేదన ప్రక్రియకు లోను చేయటం ద్వారా సైతం నాఫ్తాను సంగ్రహించొచ్చు. వివిధ పరిశ్రమల్లో మరియు ప్రాంతాల్లో నాఫ్తాను ముడి చమురు లేదా కిరోసిన్ వంటి శుద్ధి చేసిన ఉత్పత్తుల మాదిరిగా కూడా వాడతారు.
అయితే.. ఇప్పుడు ఈ నాఫ్తా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. పెట్రోకెమికల్స్ తయారీలో ఉపయోగించే ఈ పదార్థాన్ని రిలయెన్స్ సంస్థ రష్యా నుంచి భారీఎత్తున కొనుగోలు చేసింది. ఇదొక అరుదైన విషయమని చెప్పొచ్చు. ఎందుకంటే.. 2019కు ముందు.. నాలుగేళ్ల వ్యవధిలో కేవలం ఒక్కసారే నాఫ్తాను దిగుమతి చేసుకున్న ఈ ప్రైవేట్ రిఫైనర్.. 2020 మరియు 2021లో అసలు ఈ ఇంపోర్ట్స్ జోలికే పోలేదు. అలాంటిది.. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లలో.. అంటే.. రెండు నెలల వ్యవధిలోనే.. ఏకంగా లక్షన్నర టన్నుల నాఫ్తాను దిగుమతి చేసుకుంది.
read more: Tata-Bisleri: బిస్లెరీ విషయంలో టాటా బొక్క బోర్లా ఖాయం
ఇండియా మొత్తం 4 లక్షల 10 వేల టన్నులు ఇంపోర్ట్ కాగా రిలయెన్స్ ఒక్కటే ఇంతగా కొనుగోలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్నిబట్టి ఆ సంస్థ.. రష్యా శుద్ధి చేసిన ఇంధనాల కొనుగోలు పట్ల ఆసక్తి కనబరుస్తోందనే విషయం అర్థమవుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను పశ్చిమ దేశాలు నిలిపేయటం కూడా ఇందుకు ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.