Recykal Co-founder: వేస్ట్ అనే పదం వింటే చాలు.. అది దేనికీ పనికిరాదని మనం ముందే డిసైడ్ అయిపోతాం. అందుకే.. చెత్తను మన ఇంటికి దూరంగా విసిరికొడతాం. కానీ.. రీసైకల్ అనే సంస్థ.. వేస్ట్‌కి బెస్ట్ సొల్యూషన్స్ సూచిస్తోంది. వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థాన్ని చెబుతోంది.
పనికిరాని వస్తువుల నుంచి పైసలు పుట్టిస్తోంది. వేస్ట్ మేనేజ్‌మెంట్‌కి ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ని
వినియోగిస్తోంది. ఇదొక పెద్ద సబ్జెక్ట్ అని, ఈ సెక్టార్‌కి ఇండస్ట్రీ స్థాయి ఉందని అంటోంది. దీని ద్వారా మన భారతదేశాన్ని గ్రీన్ ఇండియాగా మార్చటానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో.. వ్యర్థాల నిర్వహణ అనేది ఎంత పెద్ద ప్రక్రియో వివరిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు రీసైకల్ కంపెనీ కోఫౌండర్ విక్రమ్ ప్రభాకర్‌తో ఎన్టీవీ బిజినెస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ వీడియో.. మీ కోసం..