NTV Telugu Site icon

Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..

Food Poisaning

Food Poisaning

Hyderabad:  ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి. వందల్లో రేట్లు పెట్టి ఆహారాన్ని అందిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అందుకు తగ్గట్లుగా ఆహార నాణ్యతను అందించడం లేదు. మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతూ, మళ్లీ దాన్ని వేడి చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా రెస్టారెంట్లు కూడా నాణ్యతను పాటించకుండా ఆహారాన్ని అందిస్తున్నట్లు తేలింది. ఇలా పట్టుబడిన రెస్టారెంట్లు ఏదో చిన్న చిన్న రెస్టారెంట్లు కాదు. నగరంలో పేరొందిన రెస్టారెంట్లు ఈ జాబితాలో ఉండటం గమనార్హం.

ఎలా ఈ రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలను రిస్కులో పెడుతున్నాయో ఈ వీడియో చూడండి.