NTV Telugu Site icon

Oil giant Saudi Aramco: కనీవినీ ఎరగని రీతిలో లాభాలను సొంతం చేసుకున్న సంస్థ

Oil giant Saudi Aramco

Oil giant Saudi Aramco

Oil giant Saudi Aramco: అంతర్జాతీయంగా పేరొందిన సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్‌ సంస్థ.. ఆరామ్‌కో.. ఇంతకుముందు ఎన్నడూలేనంతగా గొప్పగా రాణించింది. గతేడాది ఏకంగా 13 పాయింట్‌ రెండూ సున్నా లక్షల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించింది. తద్వారా.. తన రికార్డులను తానే తిరగరాసుకుంది. అంతేకాదు.. యాపిల్‌, వొడాఫోన్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలతోపాటు ఎక్సాన్‌ మొబిల్‌, షెల్‌ తదితర అమెరికా సంస్థలు 2022లో నమోదుచేసిన ప్రాఫిట్స్‌ని అధిగమించింది.

read more: Beer: జపాన్ బ్యాంక్ నుంచి ఫండ్‌రైజ్‌ చేసిన ‘బిరా 91’

ఈ నేపథ్యంలో మార్కెట్‌ వ్యాల్యూపరంగా ఆరామ్‌కో కంపెనీ.. ప్రపంచంలోనే 2వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. ఆరామ్‌కో కన్నా ముందు యాపిల్‌ కంపెనీ ఒక్కటి మాత్రమే ఉండటం విశేషం. ఎడారి దేశమైన సౌదీ అరేబియాలో చమురు నిల్వలు భూమి పైపొరల్లోనే ఉండటం వల్ల అక్కడ ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ముడి చమురును వెలికితీయొచ్చు.

ఫలితంగా ఆ దేశానికి ఏటా లాభాలు పెరుగుతున్నాయి. దీనికితోడు.. ఏడాది కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రష్యా నుంచి క్రూడాయిల్‌ కొనొద్దంటూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించటం సౌదీ అరేబియాకి పరోక్షంగా కలిసొచ్చింది. మరోవైపు.. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా సైతం కొవిడ్‌ ఆంక్షలను తొలగించటంతో ఆయిల్‌కి డిమాండ్‌ భారీగా పెరిగింది. ఇదే అదునుగా సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని పెంచింది. ఇవన్నీ ఇన్‌డైరెక్ట్‌గా ప్లస్‌ అయ్యాయి. ఆరామ్‌కో సంస్థ 2020లో 49 బిలియన్‌ డాలర్ల లాభాన్ని మాత్రమే సొంతం చేసుకోగా 2021లో దానికి రెట్టింపు కన్నా ఎక్కువ లాభాలను.. అంటే.. 110 బిలియన్‌ డాలర్ల ప్రాఫిట్స్‌ పొందింది.

2022లో కనీవినీ ఎరగతి రీతిలో 161 బిలియన్‌ డాలర్ల లాభాలను మూటగట్టుకుంది. అయితే.. ఈవిధంగా.. శిలాజ ఇంధనాల వాడకాన్ని విపరీతంగా పెంచటం ద్వారా వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందనే విమర్శలను ఆరామ్‌కో కంపెనీ ఎదుర్కొంటోంది.