NTV Telugu Site icon

Jobs Market-2023: కొత్త ఏడాదిలో నియామకాలపై సర్వే

Jobs Market 2023

Jobs Market 2023

Jobs Market-2023: ఇండియన్‌ జాబ్‌ మార్కెట్‌లో కొత్త సంవత్సరం నియామకాల జోరు నెలకొననుంది. ముఖ్యంగా స్పెషలైజ్డ్‌ ఐటీ, టెలికం అండ్‌ సేవల ఆధారిత రంగాలు ఈ రిక్రూట్‌మెంట్లలో జోష్‌ నింపనున్నాయి. రిటైల్‌, ఇ-కామర్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల హైరింగ్‌లో పండుగ సీజన్‌ ఉత్సాహం ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది.

ఆతిథ్యం మరియు ఎయిర్‌లైన్‌ సెక్టార్లలో సైతం ఇదే ట్రెండ్‌ కంటిన్యూ కానుంది. స్టాఫింగ్‌ అండ్‌ రిక్రూటింగ్‌ సర్వీసెస్‌ సంస్థ ర్యాండ్‌స్టాడ్‌ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ స్టడీ రిపోర్ట్‌ ప్రకారం.. 2023లోని మొదటి మూడు నెలల్లో ఐటీ రంగం కొత్తవారికి భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వనుంది. ప్రతి 10 కంపెనీల్లో 7 కంపెనీలు స్టాఫ్‌ను పెంచుకోనున్నాయి. డేటా సైన్స్‌, అనలిటిక్స్‌, ఇతర టెక్నాలజీ సంబంధిత జాబ్‌ రోల్స్‌కి కూడా డిమాండ్‌ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

read also: IPL Cricket: ఇండియన్‌ ప్రాఫిటబుల్‌ లీగ్‌

డిజిటలైజేషన్‌ పెరగనుండటం, 5జీ సాంకేతికత విస్తరించనుండటం, సర్వీస్‌లో గ్రోత్‌ లెవల్స్‌ కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులకు చేరనుండటం ఇందుకు కారణాలని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తుండగా ఇండియన్‌ ఐటీ సంస్థలు మాత్రం దీనికి భిన్నంగా కొలువుల మేళాలకు తయారవుతుండటం విశేషం. శాప్‌, సేల్స్‌ఫోర్స్‌ డెవలపర్స్‌, డాట్‌ నెట్‌, డేటా అనలిటిక్స్‌, జావా, ఫుల్‌ స్టాక్‌, డెవలప్స్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రా వంటి ఐటీ డిజిటల్‌ స్కిల్స్‌ ఉన్నోళ్లకు ఎక్కువ జాబులొచ్చే ఛాన్స్ ఉన్నాయి.

ఈ ఏడాది దాదాపు 71 శాతం సంస్థలు ఐటీ సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు ఉన్నవారిని రిక్రూట్‌ చేసుకున్నట్లు ఇండీడ్‌ అనే కంపెనీ నిర్వహించిన పరిశీలనలోనూ తేలింది. హైస్కిల్డ్‌ ఎంప్లాయీస్‌కి, క్రిప్టో రోల్స్‌లో ఫిట్టయ్యేవారికి, యాప్‌ అండ్‌ ఫుల్‌-స్టాక్‌ డెవలపర్లకు, డేటా ఇంజనీర్లకు, గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లలో చేసేవారికి ఎంప్లాయబిలిటీ పాజిటివ్‌గా ఉండనుంది. టయర్‌-1 సిటీల్లో ఐటీ నియామకాలు అధిక శాతం జరుగుతాయి.

టయర్‌-2, టయర్‌-3 నగరాల్లోనూ దాదాపు ఇదే ధోరణి కంటిన్యూ అవుతుంది. ఎన్విరాన్‌మెంట్‌, సోషల్‌ అండ్‌ గవర్నెన్స్‌ వంటి సబ్జెక్టుల్లో ఎక్స్‌పర్ట్‌ అయినవారికి ఈ రంగంలో ప్రొఫెషనల్‌ జాబ్స్‌ లభిస్తాయి. రెగ్యులర్‌ కొలువులతోపాటు గిగ్‌ జాబ్స్‌ సంఖ్య వచ్చే ఏడాది పెరగుతుంది. రానున్న మూడేళ్లలో ఇండియాలో 90 లక్షల గిగ్‌ జాబ్స్‌ అందుబాటులోకి వస్తాయని ఇండీడ్‌ సంస్థ పేర్కొంది.