NTV Telugu Site icon

India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్‌ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం

India's First C-295 Aircraft

India's First C-295 Aircraft

India’s First C-295 Aircraft: రక్షణ శాఖ కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్న అత్యాధునిక విమానం C-295. ఇటీవల విడుదలైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ వీడియోలు, ఇమేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ అధునాతన విమానాన్ని టాటా మరియు ఎయిర్‌బస్‌ సంస్థ కలిసి రూపొందిస్తున్నాయి. వాయుసేనకు అందించనున్న 16 మధ్య తరహా విమానాల్లో ఇది మొదటిది.

మొత్తం.. 56.. C-295 విమానాల సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2021 సెప్టెంబర్‌లో ఆమోదం తెలిపింది. అనంతరం.. రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఎయిర్‌బస్‌ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎప్పటినుంచో వాడుతున్న అవ్రో విమానాలకు బదులుగా ఈ కొత్త విమానాలను తెప్పిస్తున్నారు. అవి వస్తే.. మన వాయుసేన ఆధునికీకరణ దిశగా మరో ముందడుగు వేసినట్లు అవుతుంది.

read more: Minister KTR: తెలంగాణలో కైటెక్స్‌ గార్మెంట్స్‌ తొలి యూనిట్‌

ఏడాది తర్వాత ఈ రెండు కంపెనీలు C-295 విమానాల తయారీ మరియు అసెంబ్లింగ్‌ కోసం పరస్పరం సహకరించుకోనున్నాయి. భవిష్యత్తులో టాటా సంస్థే సొంతగా ఈ విమానాలను రూపొందించనుంది. తద్వారా.. సైనిక విమానాన్ని తయారుచేసిన తొలి భారతీయ ప్రైవేట్‌ సంస్థగా గుర్తింపు పొందనుంది. ఈ మేరకు ప్రధాని మోడీ 2022 అక్టోబర్‌లో గుజరాత్‌లోని వడోదరలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మ్యానిఫ్యాక్షరింగ్‌ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన కూడా చేశారు.

ఈ ప్రాజెక్టు విలువ 21 వేల 935 కోట్ల రూపాయలు. ఇదిలాఉండగా ఎయిర్‌బస్‌ సంస్థ నుంచి మొదటి 16.. C-295 విమానాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి 2025 ఆగస్టు మధ్య కాలంలో అందనున్నాయి. మొట్టమొదటి మేడిన్‌ ఇండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ మాత్రం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది.

Show comments