Indian Economy Growth in 2023: వచ్చే ఏడాది మన ఆర్థిక వ్యవస్థ సగటు వృద్ధి అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Economy Growth in 2023: వచ్చే సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సగటు వృద్ధిని అధిగమించగలదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2023లో మూలధన ఖర్చులు పుంజుకోవటం, వినియోగ సామర్థ్యం అధికం కావటం మరియు మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగటం వంటివి ఈ దిశగా కీలక పాత్ర పోషించనున్నాయని చెబుతున్నారు.
గ్లోబల్ ఎకానమీ పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థకు ఆటంకాలు కలిగించనున్నప్పటికీ వృద్ధి మాత్రం 4.8 శాతం నుంచి 5.9 శాతం వరకు ఉండొచ్చని పేర్కొన్నారు. గ్లోబల్ ఎకనమిక్ గ్రోత్ అంచనాల కన్నా ఇది 1.8 శాతం ఎక్కువని విశ్లేషకులు గుర్తు చేశారు. వస్తువులకు, ఉత్పత్తులకు డిమాండ్ తగ్గటం, అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అస్థిరతలు ఇండియా వృద్ధికి ప్రధాన అవరోధాలు అని కొటక్ ఎకనమిక్ రీసెర్చ్ ప్రతినిధులు చెప్పారు.
Also Read
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
- YS Jagan: చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ దొంగ పనులు.!
read also: Subscribers Want Free Content On OTTs: ఓటీటీలో ఉచిత కంటెంట్ వైపే ప్రేక్షకుల మొగ్గు
ప్రపంచ బ్యాంకు కూడా ఇండియా జీడీజీ గ్రోత్‌ను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి అప్‌గ్రేడ్ చేయటాన్ని ప్రస్తావించారు. దీనికితోడు పన్నుల వసూళ్లు గతేడాది కన్నా పెరిగాయి. సామర్థ్య వినియోగం 17 త్రైమాసికాల గరిష్టానికి చేరటం, విదేశీ మారక నిల్వలు 550 బిలియన్ డాలర్ల మార్క్‌ను మరోసారి దాటడం వంటివి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి సానుకూల సంకేతాలని పరిశీలకులు వివరించారు.
ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో విదేశీ పెట్టుబడిదారులు ఇండియన్ మార్కెట్‌ను వీడిపోగా రెండో అర్ధ భాగంలో ఈ ట్రెండ్ రివర్స్ అయింది. జులై, నవంబర్ మధ్య కాలంలో 92,763 కోట్ల రూపాయల ఎఫ్‌పీఐలు మన మార్కెట్‌లోకి ప్రవహించాయి. ఇండియా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పునరుద్ధరణ సంకేతాలను చూపుతోందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. ఉపాధి, క్రెడిట్ ఆఫ్‌టేక్, ఆటోమొబైల్ అమ్మకాలు, వాణిజ్యం అనే నాలుగు కీలక సూచికలను ఆ రిపోర్ట్ రిఫరెన్స్‌గా చూపింది.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!