Site icon NTV Telugu

Hilo Design: మనలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. దానికి తగ్గ కాస్ట్యూమ్స్‌ను రూపొందించేదే ‘హిలో డిజైన్‌’

Hilo Design2

Hilo Design2

Hilo Design: ‘ఎవ్రీ మ్యాన్‌ హ్యాజ్‌ ఏ స్టైల్‌’ అంటారు. అంటే.. ఒక్కొక్కరిదీ ఒక్క శైలి అని అర్థం. ఆ స్టైల్‌కి తగ్గట్లు కాస్ట్యూమ్స్‌ని రూపొందించేందుకే ‘హిలో డిజైన్‌’ అనే ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేసినట్లు సాహిత్‌ గుమ్మడి, మౌన గుమ్మడి తెలిపారు. హిలో డిజైన్‌ అనేది వినూత్నమైన దుస్తులు లభించే వేదిక. ముఖ్యంగా మగవాళ్లకు వాళ్ల ఫిజిక్‌, ప్రొఫైల్‌ని బట్టి సరైన క్లాతింగ్‌ని సూచిస్తుంది. న్యూ ఏజ్‌ పీపుల్‌కి నప్పే డ్రస్‌లను సజెస్ట్‌ చేస్తుంది. తద్వారా ఫీల్‌ గుడ్‌ ఇ-కామర్స్‌ ఎక్స్‌పీరియెన్స్‌ని సొంతం చేస్తుంది. ఏ సందర్భంలో ఎలాంటి షర్టూ, ప్యాంటూ, డ్రస్సూ వేసుకోవాలో చక్కగా వివరిస్తుంది.

రోజువారీ ధరించే క్యాజువల్స్‌ మొదలుకొని పెళ్లిళ్లు, రిసెప్షన్లు, ఫెస్టివల్స్‌ తదితర స్పెషల్‌ అకేషన్స్‌లో మీరు సెంటరాఫ్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా ఉండాలంటే ఏ మోడల్‌ కాస్ట్యూమ్స్‌ సెలెక్ట్‌ చేసుకోవాలో చెబుతుంది. చాలా మంది మగవాళ్లు తాము కూడా పది మందిలో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ఆ మేరకు ప్రయత్నాలు చేయరు. ఎవరినీ ఏమీ అడగరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి ఏదో ఒకటిలే అనుకొని ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లలో వెతికి కొత్త బట్టలు కొనుక్కొని, కట్టుకొని ఫంక్షన్స్‌కి, ఆఫీసులకి వెళుతుంటారు. తీరా.. ఎవరూ ఏ కాంప్లిమెంటూ ఇవ్వకపోయే సరికి కాస్త ఫీలవుతారు. తనను ఎవరూ గుర్తించలేదని కొంచెం బాధపడతారు.

డబ్బులైతే ఖర్చవుతాయి. కానీ ఆశించిన ఫలితం దక్కదు. దీంతో ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. అలమారలో 10 జతల బట్టలు ఉంటాయి. అయినా అందులో రెండు మూడు జతలనే రెగ్యులర్‌గా ధరిస్తుంటారు. లేదా ఎదుటివాళ్లను బ్లైండ్‌గా ఫాలో అవుతుంటారు. ఇలా కాకుండా.. మీకంటూ ఒక స్టైల్‌ మెయిన్‌టెయిన్‌ కావాలంటే, మీకంటూ ఒక స్పెషల్‌ లుక్‌ రావాలంటే ‘హిలో డిజైన్‌’ను సంప్రదిస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే ఆ సంస్థ ఫౌండర్లు సాహిత్‌ గుమ్మడి, మౌన గుమ్మడి ‘ఎన్‌-బిజినెస్‌ వుయ్ టాక్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చు. ఆ వీడియో లింక్ ఈ కిందే ఉందని గమనించగలరు.

Exit mobile version