NTV Telugu Site icon

Driver Salary: నెలకి రూ.2 లక్షలు. ఎవరి డ్రైవర్‌కి? ఎప్పుడు? ఏంటా కథ?

Driver Salary

Driver Salary

Driver Salary: మామూలుగా.. కార్‌ డ్రైవర్‌ నెల జీతం ఎంతుంటుంది? మహాఅయితే 20 వేల రూపాయలుంటుందేమో. ఇంకా అయితే కొంత మంది వీవీఐపీలు 50 వేల వరకు ఇస్తారేమో. కానీ.. ఏకంగా 2 లక్షల రూపాయలు సమర్పించారంటే.. అది.. చాలా విశేషమే కదా?. అయితే.. దీనికే ఆశ్చర్యపోకండి. ఇది ఐదేళ్ల కిందట ఇచ్చిన శాలరీ. మరి.. ఇప్పుడు ఇంకెంత ఉంటుందో ఊహించుకోండి.

read more: India’s services sector: ఫిబ్రవరిలో 12 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ

ఇంతకీ.. ఈ రేంజ్‌లో జీతం ఇచ్చి.. అతడి జీవితాన్ని పావనం చేసిన ఆ గొప్ప వ్యక్తి ఎవరనుకుంటున్నారా?. ఆయనే.. అంబానీ. అపర కుబేరుడు.. ముకేష్‌ అంబానీ. రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌కి అధిపతి అయిన ఈయన దగ్గర 2017లో కార్‌ డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి నెలకి 2 లక్షల శాలరీ తీసుకునేవాడంటున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై రెగ్యులర్‌ మీడియాలో స్టోరీలు కూడా వచ్చాయి. దీంతో ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

కానీ.. ఈ స్థాయిలో వేతనం తీసుకోవాలంటే చాలా ప్రత్యేక అర్హతలు ఉండాలి. లగ్జరీ మరియు బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లను నడపగలిగే నైపుణ్యం కావాలి. ఈ మేరకు శిక్షణ పొంది ఉండాలి. ఎలాంటి రోడ్ల మీదైనా, ఎటువంటి అనూహ్యమైన, ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా యజమానిని సురక్షితంగా గమ్యానికి చేర్చే గట్స్‌ ప్రదర్శించాలి. అలాంటివారికి మాత్రమే.. ఇలా.. ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మాదిరిగా.. ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌ లెవల్లో.. లక్షల్లో శాలరీ వస్తుంది. సెలబ్రిటీలా?.. మజాకా?.

Show comments