Digital Payments: మన దేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో డిజిటల్ పేమెంట్ల సంఖ్య 23 బిలియన్లకు పైగా నమోదు కాగా ఆ చెల్లింపుల విలువ 38 పాయింట్ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్, ప్రిపెయిడ్ కార్డులు మరియు మొబైల్ వ్యాలెట్ల ద్వారా జరిగిన ఈ మొత్తం లావాదేవీల్లో దాదాపు సగం వాటా ఒక్క యూపీఐ ట్రాన్సాక్షన్‌లదే కావటం విశేషం. ఈ లావాదేవీల సంఖ్య 19 పాయింట్ ఆరు ఐదు బిలియన్లుగా నమోదైంది. వీటి విలువ 32 పాయింట్ 5 లక్షల కోట్ల రూపాయలని వరల్డ్ లైన్ ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్ లేటెస్ట్‌గా వెల్లడించింది.
read also: L & T Company: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య మరియు ట్రాన్సాక్షన్ల వ్యాల్యూ గతేడాది నుంచి ఇప్పటివరకు సుమారు రెట్టింపయ్యాయి. పోయినేడాది మూడో త్రైమాసికంతో పోల్చితే ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లోని థర్డ్ క్వార్టర్‌లో యూపీఐ లావాదేవీల సంఖ్య 88 శాతం, లావాదేవీల విలువ 71 శాతం పెరగటం చెప్పుకోదగ్గ విషయం. ట్రాన్సాక్షన్ల సంఖ్య మరియు ట్రాన్సాక్షన్ల వ్యాల్యూలో టాప్-3 యూపీఐ యాప్‌లుగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్‌లు నిలిచాయి. చెల్లింపులు చేసిన టాప్-5 బ్యాంకుల లిస్టులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఉన్నాయి.