Site icon NTV Telugu

Colourful Snake: రంగురంగులుగా, అందంగా కనిపించే పాము.. దగ్గరికెళ్లారో డేంజరే..

Untitled Design (21)

Untitled Design (21)

ఈ భూమ్మీద ఎన్నో రకాలు సర్పాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని రకాల జాతల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. కానీ అవి కాటువేస్తే ప్రాణాలు పోవాల్సిందే.. అయితే సాధారణంగా మనం పాములను చూస్తేనే.. ఆమడ దూరం పరిగెడతాం.. కొందరు మాత్రం దైర్యంతో వాటితో పట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ రంగు రంగులతో ఓ పాము చెట్లతో తిరుగుతుంది. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని ఒక్క చుక్క విషం ప్రాణాలను తీసేస్తుంది. ప్రస్తుతం ఈ పాము సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Serious Injury: తుమ్ము వస్తే ఆపుకుంటున్నారా.. అయితే .. బీకేర్ ఫుల్

ఒక చెట్టు చుట్టూ పాము చుట్టుకుని వేట కోసం చూస్తుంది. కానీ దూరం నుంచి చూస్తే మాత్రం అది ఒక చెట్టు కొమ్మలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది చెట్ల మాదిరిగానే ప్రత్యేకంగా రంగుతో కూడి ఉంటుంది. అందువల్ల, ఇది చెట్టు రంగుతో కలిసిపోతుంది. గుర్తించడం కష్టతరం. ఆఫ్రికాలో ఈ పామును “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. అందుకే జనం దానిని చూడగానే పారిపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాము వీడియోను చూసి జనం షాక్ అవుతున్నారు. కొందరు ఈ పామును చూసి , అది బూమ్స్‌లాంగ్ పాము అని, అత్యంత విషపూరితమైన ఆఫ్రికన్ పాము కామెంట్లు పెడుతున్నారు. చూడడానికి ఎంతో అందంగా, రంగు రంగులతో కనిపించే పాము చాలా డేంజర్ అని.. దాని దగ్గరికి వెళితే.. పై ప్రాణాలు పైకే పోతాయని పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు.

Exit mobile version