NTV Telugu Site icon

Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌కి టాటా.. ప్రత్యామ్నాయ సోషల్ మీడియా కోసం వేట..

Twitter

Twitter

Bye Bye Twitter: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్విట్టర్‌.. ట్రెండింగ్‌ టాపిక్‌ అయిపోయింది. ఆ సంస్థకు సంబంధించి రోజూ కొత్త కొత్త వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఇదొక సరికొత్త డైలీ సీరియల్‌గా మారిపోవటం ఆసక్తిని మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకూ ట్విట్టర్‌ను ఒక సోషల్‌ మీడియా మాదిరిగా హాయిగా ఎంజాయ్‌ చేసిన యూజర్లు మరిన్నాళ్లు ఇలా కొనసాగే సూచనలు కనిపించట్లేదు. ట్విట్టర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో అటు ఆ సంస్థ ఉద్యోగులు, ఇటు ఆ సామాజిక మాధ్యమ ఖాతాదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆల్టర్నేటివ్‌ సోషల్‌ మీడియా కోసం ఎదురుచూస్తున్నారు.

మరీ ముఖ్యంగా బ్రెజిల్‌ దేశంలోని సామాజిక మాధ్యమ అభిమానులు.. ‘కూ’ అనే వెరైటీ పేరు కలిగిన ఇండియన్‌ సోషల్‌ మీడియా యాప్‌ వైపు భారీగా జంప్‌ అయ్యారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఒక మిలియన్‌ యూజర్లు ‘‘కూ’’లో చేరిపోయారు. గత శుక్రవారం, ఆదివారం మధ్య.. అంటే.. మూడు రోజుల్లోనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవాళ్ల సంఖ్య కనీసం 5 లక్షలుగా నమోదైంది. ఈ కొత్త ట్రెండ్‌కి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ట్విట్టర్‌కి ప్రత్యామ్నాయంగా మరో సామాజిక మాధ్యమం కోసం చూస్తున్నాయని తేలింది.

read more: L & T Company: ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌

ట్విట్టర్‌ వ్యవహారం సామాన్యులకే కాదు.. సెలెబ్రిటీలకు సైతం చిర్రెత్తుకొచ్చేలా చేస్తోంది. బ్రెజిల్‌లో ఫెలిపే నేటో అనే సెలెబ్రిటీకి కోటీ 54 లక్షల మంది ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా ట్విట్టర్‌తో విసుగెత్తిపోయారు. బ్రెజిల్‌లో అతిపెద్ద ‘‘కూ’’ కలిగి ఉండటమే తన లక్ష్యమంటూ ఆయన ట్వీట్‌ పెట్టారు. ప్రస్తుతం ‘కూ’లో ఎక్కువ మంది.. అంటే.. దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్స్‌ కలిగిన మోస్ట్‌ పాపులర్‌ బ్రెజిలియన్‌ హ్యాండిల్‌గా ఫిలిపే నేటో గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ‘కూ’ యాప్‌ యూజర్ల సంఖ్య 50 మిలియన్‌లకు పైగా నమోదు కావటం విశేషం.

‘కూ’ యాప్‌కి కొత్త వినియోగదారులు వెల్లువెత్తుతుండటంతో ఆ అప్లికేషన్‌ టీమ్‌ తమ ఎఫర్ట్‌ మొత్తాన్ని సపోర్టింగ్‌ యూజర్లపై ఫోకస్‌ పెట్టడానికే వినియోగిస్తోంది. సర్వర్‌ 24 గంటలు పనిచేసేలా చూసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినప్పటికీ యాప్‌ స్లోగానే పనిచేస్తోందని, ఒక్కోసారి అసలు స్పందించట్లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్నిబట్టి ‘కూ’ యాప్‌కి యూజర్ల తాకిడి ఏ రేంజ్‌లో ఉందో అర్థంచేసుకోవచ్చు. ‘కూ’ యాప్ సడన్ సక్సెస్‌కి ట్విట్టర్‌లో తలెత్తిన టెక్నికల్‌ ఇష్యూస్‌ కూడా కారణమయ్యాయి. అలాంటి ఇష్యూస్‌ ఏమీలేవని ట్విట్టర్‌ చెబుతున్నా బ్రెజిల్‌ జనం నమ్మే పరిస్థితిలేదు. ‘కూ’ యాప్ మీద వాళ్లకు పూర్తి విశ్వాసం ఉండటమే కారణం.