మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధం… గీతను ఒక ప్రత్యేక గ్రంథముగా భావిస్తాం.. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటిగా నిలిచిపోయింది.. ఇది కేవలం హిందువుల కోసమే కాదు.. సర్వమానవాళికి ఉపయోగం అని చెబుతారు పండితులు.. ఇక, భగవద్గీత గురించి బుల్లితెరపై మొట్టమొదటిసారిగా ‘భక్తిటీవీ’ బృహత్తర కార్యక్రమం తీసుకుంది.. 18 అధ్యాయాల పరమాత్ముని ప్రబోధం భగవద్గీతా గాన ప్రవచనం ఏర్పాటు చేసింది.. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గీతాగాన గంధర్వ శ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి చే.. సంపూర్ణ భగవద్గీతా మీకోసం అందిస్తోంది భక్తి టీవీ.. ఇవాళ్టి నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు మీ భక్తి టీవీలో ప్రత్యక్షప్రసారం ద్వారా ఆ కార్యక్రమాన్ని చూడొచ్చు.. భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యద్భుత జీవన గీత… భగవద్గీతకు సంబంధించిన ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..