Bengaluru and Hyderabad: బెంగళూరు.. హైదరాబాద్.. మన దేశంలోని ఐటీ రంగంలో దూసుకెళుతున్న నగరాలు. ఇది.. నాణేనికి ఒక వైపైతే.. మరో వైపు.. ఈ రెండు సిటీలు సైబర్ నేరాల్లో కూడా లీడింగ్‌లో ఉన్నాయి. 2021వ సంవత్సరంలో మొత్తం 52 వేల 974 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా ఇందులో సగం కేసులు కేవలం కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలోనే రిజిస్టర్ అయ్యాయి.
ఈ లేటెస్ట్ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. అయితే.. ఈ సంస్థ కేవలం ఎఫ్‌ఐఆర్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. అందువల్ల ఇది వాస్తవ పరిస్థితికి పూర్తిగా అద్దం పట్టదు. గవర్నమెంట్ పోర్టల్‌లో 2020వ సంవత్సరం నుంచి 16 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ సంబంధిత ఫిర్యాదులు నమోదయ్యాయి. దీన్నిబట్టి సగటున 50 సంఘటనలకు ఒకటి చొప్పున మాత్రమే ఎఫ్‌ఐఆర్ ఫైల్ అవుతోందని అర్థంచేసుకోవచ్చు.
Swiggy’s Losses: మగ్గిపోతున్న స్విగ్గీ
అంతేకాదు. నేరం జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే అవగాహన ప్రజల్లో పెరిగిందనటానికి కూడా ఈ గణాంకాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. కానీ.. సైబర్ క్రైమ్స్ కట్టడికి ఈ స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవనే అభిప్రాయం నెలకొంది. ఎందుకంటే.. ఇండియాలో 2020 చివరి నాటికి 202 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి.
దీంతో ఈ నేరాల వల్ల దేశ వ్యాపార రంగానికి 2022లో యావరేజ్‌గా 2 పాయింట్ 3 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. సైబర్ సెక్యూరిటీ కార్యక్రమాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ గత ఏడేళ్లలో 9 రెట్లు పెరిగింది. ప్రస్తుత బడ్జెట్‌లో 515 కోట్లు కేటాయించారు. అయినా పరిస్థితిలో మార్పు రావట్లేదు. సైబర్ నిపుణులకు ఈ సమస్య ఛాలెంజ్ విసురుతోంది.