Biryani Ball:మ్యాగిలా.. అందుబాటులోకి రెండు నిమిషాల బిర్యానీ బాల్..
- మార్కెట్లోకి వచ్చిన ఇన్‌స్టంట్ పరోటాలు, చపాతీలు, సూపులు
- తాజాగా మార్కెట్లోకి వచ్చిన బిర్యానీ బాల్
- ఏఐ క్రియేటివిటీ అంటున్ననెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు నిమిషాల మ్యాగీలా… ఇప్పుడు రెండు నిమిషాల బిర్యానీ కూడా అందుబాటులోకి వచ్చింది. రోజురోజుకూ మన ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. గంటల తరబడి వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేకుండా, కావాల్సిన ప్రతి రకం ఆహారం ఇప్పుడు మార్కెట్‌లో సులభంగా లభిస్తోంది. ఇప్పటికే ఇన్‌స్టంట్ పరోటాలు, చపాతీలు, సూపులు వంటి అనేక ఫుడ్ ఐటమ్స్ వినియోగదారుల ముందుకు వచ్చాయి. తాజాగా, కేవలం రెండు నిమిషాల్లో తయారయ్యే “బిర్యానీ బాల్” కూడా మార్కెట్‌లోకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కొందరు కంటెంట్ క్రియేటర్లు ‘బిర్యానీ బాల్’ పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఆ వీడియోల ప్రకారం, బంతి ఆకారంలో ఉన్న బిర్యానీని ఒక పాత్రలో వేసి వేడి నీళ్లు పోస్తే, కేవలం కొన్ని సెకన్లలోనే అది విచ్చుకుని వేడి వేడి బిర్యానీగా మారిపోతోంది. చూడటానికి అచ్చం నిజమైన బిర్యానీలా కనిపించడం విశేషం. అయితే ఈ వీడియోలను చూసిన నెటిజన్లు మాత్రం ఇది ఏఐ ద్వారా రూపొందించిన క్రియేటివ్ వీడియో అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సరదాగా ఆ బిర్యానీ బాల్‌ను ‘పిండం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఏదేమైనా, నిజమా కాదా అన్న దానితో సంబంధం లేకుండా బిర్యానీ బాల్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన వారిలో ఆసక్తి, ఆశ్చర్యం రెండూ కలగడంతో పాటు, ఇన్‌స్టంట్ ఫుడ్ ట్రెండ్ ఎంత వేగంగా మారుతోందో మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?