NTV Telugu Site icon

Vijayawada Crime: స్టూడెంట్ పై ఆకతాయిల అఘాయిత్యం

crime news

crime news

కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది.

విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే నే హడలెత్తి పోతున్నారు పిల్లల తల్లిదండ్రులు. అటుగా రోడ్డుపై వెళ్తున్న బాలికను బలవంతంగా పట్టుకొని స్కూల్ గోడ పై నుండి లోపలికి పడవేశారు ఆకతాయిలు.

Summer: ఏప్రిల్‌లో మండే ఎండలు.. జర జాగ్రత్త!

తదుపరి సుమారు గంట వరకు ఆ అమ్మాయి పై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో ఆ ఆకతాయిలు పారిపోయారు. అమ్మాయి బట్టలు చిరిగి ఉండటంతో గమనించి తల్లిదండ్రులు జరిగిన విషయం ఆరాతీశారు. అనంతరం ఘటనపై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.