NTV Telugu Site icon

విచిత్రం: అవి ప్రాణాల‌తో ఉన్నా చ‌నిపోయిన‌ట్లుగా ప‌డిపోతున్నాయి.. కార‌ణం ఇదే…

అమెరికా సంయుక్త రాష్ట్ర‌ల్లో మంచు తుఫానులు కురుస్తున్నాయి. ఈ మంచు తుఫానుల కార‌ణంగా మంచు రోడ్ల‌పై కుప్ప‌లుకుప్ప‌లుగా పేరుకుపోతున్న‌ది. ఫ‌లితంగా ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ డిగ్రీల‌లో ప‌డిపోతున్న‌ది. తీవ్ర‌మైన చ‌లి కార‌ణంగా ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డంలేదు. ఇక జంతువుల ప‌రిస్తితి చెప్పాల్సిన అవ‌ర‌సం లేదు. కొన్ని ర‌కాల జంతువులు చ‌లిని త‌ట్టుకోలేక చ‌నిపోతున్నాయి. ఇలాంటి వాటిల్లో ఇగ్వాన‌స్ అనే ఊస‌ర‌వెల్లి జాతికి చెందిన జంతువు ఒక‌టి. ఇవి శీత‌ల ర‌క్త జంతువులు. అయితే, ఉష్ణోగ్ర‌త‌లు మైన‌స్ 10 డిగ్రీలు దాటిపోతే ఈ జంతువులు అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లి చ‌నిపోయిన‌ట్టుగా ప‌డిపోతున్నాయి.

Read: లైవ్‌: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రెస్‌మీట్‌…

కేవ‌లం అవి స్పుహ మాత్ర‌మే కోల్పోతున్నాయ‌ని, చనిపోవ‌ని, వాతావ‌ర‌ణంలో ఉష్ణోగ్ర‌త‌లు పెరిగితే తిరిగి సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ చిన్న‌పాటి జంతువులు ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ రోడ్డుపై అచేత‌నంగా ప‌డిపోయి క‌నిసిస్తున్నాయి. అధికారులు వాటిని జాగ్ర‌త్త‌గా కాపాడుతున్నారు. గ‌తంలో ఒకసారి ఇలానే ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయిన స‌మ‌యంలో ఈ ఇగ్వాన‌స్‌లు అచేత‌నంగా ప‌డిపోవ‌డంతో చ‌నిపోయాయ‌ని భావించి ఖ‌న‌నం చేశారు. దీంతో వేలాది ఇగ్వాన‌స్‌లు మృతిచెందాయి. కాగా, ఈసారి శాస్త్ర‌వేత్త‌లు ముందుగానే హెచ్చ‌రించ‌డంతో ప్ర‌జ‌లు వాటిని జాగ్ర‌త్త చేస్తున్నారు.