రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా సామాన్య మానువుడు బెంబేలెత్తుతున్నాడు. పెట్రోల్, డీజల్, కూరగాయలు, పప్పుధ్యానాలు, సుమారు రూ.200లకు మించి ఏది తక్కువగా ఉండటం లేదు. ప్రతీదీ విపరీతంగా పెరగటంతో ప్రతి ఒక్కరికి భారంగా మారింది. ఏది కొన్నాలన్న, ఏది తినాలన్న, ఎక్కడి ప్రయాణించాలన్న తల పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. రూ. 500 నోటు ఇప్పుడు రూ5 గా.. ఖర్చైపోతుండటంతో సామాన్యులకు భారమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ కొనాలంటే రూ. 1050కు పైగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే మొన్నటి వరకు పెట్రోల్ , డీజల్ ధరలతో బెంబేలెత్తుతున్న వాహనదారులకు మే 21న కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
(File Pic) pic.twitter.com/13YJTpDGIf
— ANI (@ANI) May 21, 2022
దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్న సామాన్యలకు టీఎస్ ఆర్టీసీ ప్రజలకు మరో ఝలక్ ఇచ్చింది. టీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు బస్సు చార్జీలు ఇప్పుడు విద్యార్థులకు గుదిబండలా తయారైంది. సరుకులు , కూరగాయలు కొనలేక ఎలాగో అలా నెట్టుకొస్తున్న జనాలకు టీఎస్ ఆర్టీసీ పెంచిన ధరలతో మరింతగా భారంగా మారింది. ఇక విధ్యార్థులకు కైతే చెప్పనక్కర్లేదు.
కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాలు ఇంట్లో వుండి ఇప్పుడిప్పుడే బయటలకు వస్తున్న విద్యార్థులకు ఇది షాక్ అనే చెప్పాలి. 4 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం ఉన్న రూ.165 బస్ పాస్ ఛార్జీని రూ.450కి పెంచింది టిఎస్ ఆర్టీసీ. అదే క్రమంలో 8 కి.మీ. దూరానికి రూ.200 నుంచి రూ.600కి, 12కి.మీ దూరానికి రూ. 245 నుంచి రూ.900లకు , 18 కిమీ దూరానికి రూ. 280 నుంచి 1,150 కు, 22 కిమీ దూరానికి రూ. 330 నుంచి 1350 కి పెంచింది. తాజాగా పెంచిన ధరలో విద్యార్ధులపై భారం పడింది.
పెట్రోల్ ధరలు తగ్గించి ప్రతి ఒక్క వస్తులపై రేట్లు పెంచడమేంటని ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ధర
తగ్గించినట్లే తగ్గించి.. మరికొన్ని వాటిపై పెంచుకుంటూ భారం మోపడం సరికాదని మండిపడుతున్నారు. రూ. 10 తగ్గించి 1000 పెంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయని వాపోతున్నారు. ఈ విధంగా వేటి ధరలు చూసిన భగ్గుమంటున్నాయని. కూరగాయలు, గ్యాస్, పెట్రోల్, ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ బస్సు ధరలు.. విపరీతంగా పెరిగిపోవడంతో ఏం కొనాలో… ఏం తినాలో దిక్కుతోచని స్థితిలో వున్న సామాన్య మానవుడికి ఇప్పుడు విద్యార్థులపై భారం పడినటైందని, విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.