ఫీవర్ సర్వేతో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు కూడా తగ్గినట్టు వెల్లడించారు.. మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడాన్ని అభినందించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అన్నారు.. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ, 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంది.. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామని గుర్తుచేసుకున్నారు.. ఈ పరిస్థితి గమనించి సీఎం కేసీఆర్ 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి పెంచాలని ఆదేశించారని.. ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కి చేరుకున్నాం. మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం.. త్వరలో అది ప్రారంభమవుతుందన్నారు.
Read Also: వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ… వివరాలు ఇవిగో…
రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదని స్పష్టం చేశారు హరీష్‌రావు.. వైద్య రంగంలోగుణాత్మక మార్పులు తెచ్చాం… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోందని.. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ రేటు తగ్గిందని.. అయినా అలసత్వం వద్దు.. అందరం మాస్క్ ధరిద్దాం, వాక్సిన్ వేయించుకుందాం అని పిలుపునిచ్చారు.. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్న ఆయన తొలి స్థానంలో నిలిచేందుకు కృషి చేయాలని సూచించారు.. ఇక, ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా జహీరాబాద్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు.. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయన్న ఆయన.. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు.. జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు బాగా జరుగుతున్నాయని.. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు మంత్రి హరీష్‌రావు.. అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దన్నారు. దీని వల్ల తొలిగంటలో శిశువుకుఅందాల్సిన అమృతమైన పాలు అందడం లేదన్నారు. దీని వల్లశిశువులో రోగ నిరోథక శక్తి తగ్గిపోతుందన్నారు. దాదాపు మన రాష్ట్రంలోఇలా 66 శాతం మంది శిశువలకు తొలిగంటలో పాలు అందడంలేదని.. ఈ అనవసర సర్జరీల వల్ల 35 ఏళ్లకే తల్లి ఆ రోగ్యం దెబ్బతింటుందని సూచించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ఏరియా ఆస్పత్రిలో చికిత్సలు చేయాలని ఆదేశించారు.