NTV Telugu Site icon

రాష్ట్రంలో 45 శాతం ఇతర రాష్ట్రాల పేషేంట్లే…

రాష్ట్రంలో విధిలేని పరిస్థితుల్లో లాక్ డౌన్ పెట్టాల్సి వచ్చింది. అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ చేస్తున్నారు. అయితే మన రాష్ట్రంలో 45 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషేంట్లు ఉన్నారు అని Dh శ్రీనివాస్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల్లో వస్తున్న వాళ్ళు హై ఇన్ఫెక్షన్ లో ఉన్నారు. ఇక్కడ బెడ్ లేక.. చాలా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. సీఎస్ ముందే అన్ని రాష్ట్రాల సీఎస్ లకు లేఖ రాశారు.. ఒక్క ఏపీ మాత్రమే కాదు.. సరిహద్దు రాష్ట్రాలన్నిoటికీ వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ బెడ్ కన్ఫర్మ్ ఉంటే రావటమే బెటర్ అని తెలిపారు. 17 జిల్లాలతో తెలంగాణా ఇతర రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. ఇక్కడ బెడ్ లేకుండా వచ్చి ఇబ్బంది పడతారని.. ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం.. అంబులెన్సులు అడ్డుకోవడం లేదు.. సిస్టం ను ఫాలో కావాలి అంటున్నాం అని పేర్కొన్నారు.