NTV Telugu Site icon

సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు : విద్యాశాఖ కమిషనర్

మే 31 వరకు స్కూల్స్ కి కాలేజి లకు వేసవి సెలవులు ఇచ్చినట్లు చెప్పిన ఇంటర్  విద్యా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉమర్ జలీల్ సెలవుల్లో పరీక్షలు నిర్వహించిన , క్లాస్ లు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఆన్లైన్ ,ఆఫ్ లైన్ క్లాస్ లు తీసుకోవద్దు. వేసవి సెలవులు ఇచ్చేదే విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం. ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్.. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అసైన్మెంట్స్ మార్క్స్ కి ఫీజుల తో ముడి పెట్టొద్దు అని చెప్పిన ఆయన విద్యార్థులు ఆన్లైన్ లో అసైన్మెంట్ సమర్పించొచ్చు. దానికి మే 6 వరకు గడువు పొడగించం. నిర్ణిత గడువు లోపు కళాశాలలు విద్యార్థుల మార్క్స్ పంపక పోతే యాజమాన్యాల పై చర్యలు తప్పని అని అన్నారు. ప్రాక్టీకల్స్ సాధ్యం కాకపోతే విద్యార్థుల రికార్డ్(ప్రాక్టికల్) ఆధారంగానే ప్రాక్టీకల్ మార్క్స్ ఇవ్వాలి.

ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణ పై జూన్ మొదటి వారం లో సమీక్ష నిర్వహిస్తాం. మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసిన పరీక్షలు తరవాత జరుగుతాయి. ఒకటి నుండి 9 వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూ ట్యూబ్ ద్వారా ద్వితీయ సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు రివిజన్ తరగతులు ఉంటాయి.