సీఎం జగన్ చేతకానితనంతో, అవినీతి ధన దాహంతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఓ వైపు విద్యుత్ బిల్లుల మోతలు, మరో వైపు విద్యుత్ కోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేయటం చేతకాక సాయంత్రం 6 నుంచి 10 వరకు ఏసీలు ఆపు చేయమంటున్నారు. మరో నెల ఆగితే వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది రోజుకు ఒక పూటే భోజనం చేయండని అంటారేమో అని ప్రశ్నించారు. అధికారంలోకొస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 6 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆడిన మాట తప్పుతాననే విషయాన్ని మరోసారి ప్రజలకు చెప్పారు అని పేర్కొన్నారు.
విద్యుత్ బిల్లుల మోతలతో ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు…
