Site icon NTV Telugu

Revanth Reddy: ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం

pcc revanth reddy

ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తోంది.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గే వరకు విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో డీసీసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ల వద్ద ధర్నాలు విజయవంతంగా చేయాలి. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ భరోసా కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ తమ పక్షాన పోరాటం చేస్తుందని ప్రజలు విశ్వసించాలి. ఐదు అంశాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి చార్జీలు తగ్గించే వరకు పోరాటాలు జరగాలి.. రైతులకు భరోసా వచ్చే వరకు ప్రతి వరి గింజ కొనేవరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల వైకరిపైన ఉద్యమాలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రం, రాష్ట్రం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులకు నష్టం చేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. ముడి బియ్యం, ఉక్కుడు బియ్యం అంటూ ఒకరిపైన ఒకరు ప్రకటనలు చేసుకుంటూ ఇష్యూను పక్కదారి పట్టిస్తున్నారు. ఏ బియ్యం అయిన కొనండి కానీ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మనం పోరాటం చెయ్యాలి. రేపు విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడి పెద్దఎత్తున జరగాలన్నారు.

ప్రతి నాయకులు పాల్గొనాలి. టిఆర్ఎస్ ఉద్యమాలను అడ్డుకునే కుట్ర చేస్తుంది. ఎక్కడ అడ్డుకుంటే అక్కడే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాలి. పోలిస్ స్టషన్లలో కూడా ఉద్యమం కొనసాగాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛతీసుఘడ్ లో ధాన్యం క్వింటాల్ కు మద్దతు ధర 1960 క్వింటాలు తోపాటు 600 రూపాయలు బోనస్ ఇస్తూ కొంటున్నాం. భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమాలు మళ్ళీ నాయకులతో చర్చించి ప్రకటిస్తాం అన్నారు. ఈ నెలాఖరున ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగే సమావేశానికి రావాలని ప్రతిపాదన పెట్టాం. సమావేశానికి రాహుల్ గాంధీ గారు వచ్చిన సమయంలో.. డీసీసీ అధ్యక్షులతో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేద్దాం అన్నారు.

Exit mobile version