NTV Telugu Site icon

రజనీకాంత్‌.. రూ.50 లక్షల విరాళం

త‌మిళ‌నాడులో కరోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో సీఎం స‌హాయ నిధికి సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ ను కలిసి స్వయంగా అందజేశారు. కాగా తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వ‌చ్చి క‌రోనా సాయం అందిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ. 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు అందజేశారు. వీళ్లతో పాటు పలువురు తమిళ సినీ ప్రముఖులు కరోనా బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.