NTV Telugu Site icon

‘భీమ్లా నాయక్’ ప్రివ్యూ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అంట..

bheemla nayak

bheemla nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న కానీ, ఏప్రిల్ 1 న కానీ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇకపోతే అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా ప్రివ్యూ ని  హైదరాబాద్ ప్రసాద్స్ ల్యాబ్‌లో పవన్ కళ్యాణ్, రానా వీక్షించినట్లు తెలుస్తోంది.

సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా రావడంతో పవన్ ఆనందం వ్యక్తం చేయడంతోపాటు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారట.మేకర్స్ కి అవుట్ ఫుట్ బావుందని, ఖచ్చితంగా భీమ్లా నాయక్ మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా చెప్పారట. ఇదే కనుక నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయమని. రికార్డులను బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తి మరి చెప్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేయనున్నాడో చూడాలి.