NTV Telugu Site icon

మళ్ళీ మొదలెట్టేసిన మెగాస్టార్

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సినిమా షూటింగ్ మొదలెట్టేశారు. ఇటీవలే క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన చిరంజీవికి తాజాగా నెగ‌టివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే చిరు తన నెక్స్ట్ సినిమాలైన “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్” సెట్స్‌లో చేరాడు. ఇక తనకు నెగెటివ్ వచ్చిందన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు చిరంజీవి. అంతేకాదు ఈ పోస్టుతో పాటు రాబోయే సినిమాల సెట్స్ నుండి అతని కొన్ని చిత్రాలను పోస్ట్ చేశాడు.

Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్

”టెస్ట్ నెగెటివ్. పూర్తి స్టీమ్ తో వర్క్ లోకి తిరిగి వచ్చాను. నేను కోలుకోవాలని కోరుకున్న మీ అందరి ప్రేమ, శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు. వినయం అండ్ శక్తివంతం!” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఇక మెగాస్టార్ కొత్త చిత్రం ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.