ఛత్తీస్ గడ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు బీభత్సం కలిగించారు. బాంరగడ్ తాలుకాలో రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న రెండు జేసిబీ,9 ట్రాక్టర్లకు నిప్పు పెట్టారు.
దీనివల్ల రూ. కోటి వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది. దుర్గరాజ్ పీయస్ పరిధిలో 100 మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గడ్చిరోలి ప్రాంతంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత కొంతకాలంగా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.