ప్రస్తుతం టాలీవుడ్ ని మింక్ పబ్ కేస్ ఊపేస్తున్న సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ పై రైడ్ చేసి 150 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఈ రైడ్ లో ప్రముఖల పిల్లలు కూడా ఉండడం విశేషం. మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో పాటు అప్ కమింగ్ హీరోయిన్ కుషిత కూడా ఉన్నారు. అయితే ఈ కేసు రోజురోజుకు ఒక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ పబ్ ని ప్రభుత్వం క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో మిగతా సెలబ్రిటీలు ఏమవుతుంది అని భయపడుతుండగా.. అప్ కమింగ్ స్టార్ కుషిత మాత్రం ఈ డ్రగ్స్ కేసును తనకు అనువుగా మలుచుకుంటుంది. ఇప్పటివరకు వెబ్ సిరీస్, చిన్న చిన్న పాత్రలో కనిపించిన ఈ అమ్మడు.. ఈ కేసు తో ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది.
తమను కించపరిచేలా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు ఇంటర్వ్యూలు పెడుతూ తనను తానూ ప్రమోట్ చేసుకొని ఫేమస్ అవ్వాలని చూస్తోంది. ఇక ఆ ఇంటర్వ్యూలో కూడా లాజిక్ లేని సమాధానాలు చెప్పడంతో నెటిజన్లు అమ్మడిని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. బజ్జీలు తినడానికి పబ్ కి వెళ్లానని.. చీజ్ బజ్జీలు తిన్నానని.. రెగ్యులర్ గా చీజ్ బజ్జీల కోసమే పబ్ కి వెళ్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఇంకా నయం ఉగాది రోజు పబ్ లో ఉగాది పచ్చడి ఇస్తారు అని వెళ్ళాను అని చెప్పలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ డ్రగ్స్ కేసు అమ్మడికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.. మరి ఈ పేరుతో అమ్మడికి అవకాశాలు ఏమైనా వస్తాయేమో చూడాలి.