NTV Telugu Site icon

KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?

Kgf2

Kgf2

యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ వంటివారు. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదలైన అప్డేట్ లు KGF Chapter 2పై అంచనాలను మరింతగా పెంచేశాయి. మరి ఈరోజు రిలీజైన KGF Chapter 2 అభిమానుల ఆంచనాలను అందుకోగలిగిందా ? అంటే…

Read Also : Tollywood: చిరు వర్సెస్ నయన్ – భలే పోటీ!

ట్విట్టర్ టాక్ ప్రకారం హీరో ఇంట్రడక్షన్, ఇంటర్వెల్‌ బ్లాక్, సంజయ్ దత్ ఎంట్రీ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయని అంటున్నారు. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం అదరిపోయిందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ లో 3 ఎపిసోడ్లు కంప్లీట్ మాస్ స్టఫ్ తో నిండిపోయాయని, క్లైమాక్స్ ఎమోషన్ తో కట్టిపడేస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇంకేముంది యష్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని చెప్పొచ్చు. మరి విమర్శకులను, సాధారణ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందో తెలియాలంటే KGF Chapter 2 రివ్యూ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Show comments