దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘RRR’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. మార్చి 25న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక రెండవ రౌండ్ ప్రొమోషన్లకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం “రాధేశ్యామ్” విడుదలపైనే అందరి దృష్టి ఉంది. ఈ సినిమా విడుదల తరువాత ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ సినిమా ప్రమోషన్లపై మరోమారు దృష్టి పెట్టనున్నారు. దుబాయ్ లో “ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు మేకర్స్.
Read Also : James Cameron and Rajamouli : అక్కడ ఆయన… ఇక్కడ ఈయన…!!
RRR Celebration Anthem అంటూ “ఎత్తర జెండా” అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. మార్చ్ 14న ఈ సాంగ్ తో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేయనున్నారు రాజమౌళి అండ్ టీం. ఈ అప్డేట్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ముగ్గురూ ఫుల్ ఖుషీగా సెలెబ్రేషన్స్ మోడ్ లో కన్పిస్తున్నారు. 5 భాషల్లో ఈ సాంగ్ విడుదల కానుంది. ఇక “ఆర్ఆర్ఆర్” నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే.