NTV Telugu Site icon

ఆ పిల్లలకు సైబరాబాద్ పోలీసుల తోడ్పాటు…

తల్లి తండ్రి ఇద్దరు కోవిడ్ బారిన పడితే వారి పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. పిల్లల సంరక్షణ కొరకు డే కేర్ సెంటర్ లను చైల్డ్ కేర్ సెంటర్ గా మారుస్తూ చిన్నారులకు చేయూతనిస్తున్నారు. తిరిగి తల్లి తండ్రి లకు కోవిడ్ నెగిటివ్ వచ్చే వరకు చైల్డ్ కేర్ లో పిల్లలను ఉంచవచ్చు అని సీపీ సజ్జనార్ తెలిపారు. చైల్డ్ కేర్ లో ఉంటున్న పిల్లల పట్ల అన్ని జాగ్రతలు తీసుకుంటాం అని చెప్పిన సీపీ ఆ స్థలాన్ని ప్రతి రోజు స్యానిటైజ్ చేస్తాం అని పేర్కొన్నారు. అటువంటి వారికోసం ప్రత్యేక  హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు… అటువంటి వారు ఎక్కడైనా ఉంటె వెంటనే 080 – 45811215 కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.